AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మహిళతో ఎంపీ న్యూడ్ కాల్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. కఠిన చర్యలకు డిమాండ్

హిందూపురం (Hindupur) వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ (Gorantla Madhav) వివాదంలో ఇరుక్కున్నారు. ఓ మహిళతో న్యూడ్‌గా వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌ అయింది. దానిపై తీవ్ర దుమారం రేగుతోంది. అయితే...

Andhra Pradesh: మహిళతో ఎంపీ న్యూడ్ కాల్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. కఠిన చర్యలకు డిమాండ్
Gorantla Madhav
Ganesh Mudavath
|

Updated on: Aug 04, 2022 | 11:33 AM

Share

హిందూపురం (Hindupur) వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ (Gorantla Madhav) వివాదంలో ఇరుక్కున్నారు. ఓ మహిళతో న్యూడ్‌గా వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌ అయింది. దానిపై తీవ్ర దుమారం రేగుతోంది. అయితే ఆ వీడియో (Video Viral) తనది కాదని చెబుతున్నారు ఎంపీ గోరంట్ల మాధవ్‌. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరు వంశీ వీడియోను సర్క్యులేట్ చేశారని ఆరోపించారు. దమ్ము ధైర్యం ఉంటే నేరుగా ఎదుర్కోవాలని, ఈ విషయంపై తాను ఏ విచారణకైనా సిద్ధమేనని ఎంపీ స్పష్టం చేశారు. కాగా ఎంపీ గోరంట్ల మాధవ్.. తాను జిమ్‌లో ఉన్న సమయంలో వీడియో తీసి మార్ఫింగ్ చేశారని చెబుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఎంపీ వీడియో వైరల్ అవడంతో రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఎంపీ తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గౌరవప్రదమైన ఎంపీ పదవిలో ఉండి ఇలా ఎలా వ్యవహరస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. ఎంపీ గోరంట్ల మాధవ్ తీరుపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎంపీ పదవికే మచ్చ తెచ్చేలా వ్యవహించారంటూ టీడీపీ మహిళా నేతలు మండిపడుతున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. న్యూడ్ వీడియో లీక్ కావడంతో వెంటనే గోరంట్ల మాధవ్ పై సీఎం జగన్ కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ పదవికి ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us