చిత్తూరు జిల్లాలో ‘నివర్’ ఎఫెక్ట్.. పొంగిపొర్లుతున్న వాగులు.. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం

నివర్ తుఫాను ఎఫెక్ట్‌తో ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో

చిత్తూరు జిల్లాలో 'నివర్' ఎఫెక్ట్.. పొంగిపొర్లుతున్న వాగులు.. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం
Follow us

| Edited By:

Updated on: Nov 26, 2020 | 9:06 AM

Nivar Cyclone Rains AP: నివర్ తుఫాను ఎఫెక్ట్‌తో ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తిరుమల ఆలయ ప్రాంగణం జలమయమయ్యింది. ఇక కేవిబీపురం మండలం కోవనూరు వద్ద కాలువ ఓవర్‌ ఫ్లో కావడంతో శ్రీకాళహస్తి-కేవీబీపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కెవీబీపురం మండలంలో పూడి సీకే పురం వెళ్లే రోడ్డు తెగింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరదయ్యపాలెం మండలంలో ముందస్తు చర్యల్లో భాగంగా 306 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. నాగలాపురం మండలం ఎస్.ఎస్.పురం గ్రామం వద్ద భారీ వర్షాలకు రోడ్లపై వరద నీరు రోడ్లపై పారుతోంది. ఇక ఎర్ర వారి పాలెం మండలం కోటకాడ పల్లి పరిసర ప్రాంతాల్లో వరి పంట నీట మునిగింది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో పొలాల్లోకి వరద నీరు చేరడంతో.. వందల ఎకరాల్లో పంట నీటిపాలైంది.

మరోవైపు పిచ్చాటూరులోని అరణీయర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నాలుగు గేట్లను ఎత్తేశారు. అరణీయర్ నది పరివాహక ప్రాంతాల్లోని దిగువ ప్రాంతాలకు ఎవరు వెళ్లొద్దని డీఈ తెలిపారు. నది నీటిలో దిగడం, ఈత కోసం,సెల్ఫీలు కోసం చేయవద్దని డీఈ తెలిపారు. కాగా ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 32 అడుగులు ఉండగా.. ప్రస్తుతం దాదాపు 30 అడుగుల సమీపంలో నీటిమట్టం ఉన్నట్లు సమాచారం. అలాగే ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3,500 క్యూసెక్కులు ఉన్నట్లు తెలుస్తోంది. గేట్లు ఎత్తి నీటిని దిగువకు అవుట్ ఫ్లో ద్వారా 4,000 క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతున్నారు.

Read More:

తీరం దాటిన ‘నివర్’ తుఫాన్‌.. ఏపీలో ఆ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు.. ఇంట్లోనే ఉండాలన్న విపత్తుల శాఖ కమిషనర్

తిరుమలపై ‘నివర్’ తుఫాన్ ఎఫెక్ట్‌.. జలమయమైన శ్రీవారి ఆలయం.. ఇబ్బందులు పడుతున్న భక్తులు‌