నివర్ తుఫాన్ ఎఫెక్ట్: రాయలసీమలో వర్ష బీభత్సం.. రాకపోకలు బంద్.. బీఈడీ, ఎంఈడీ పరీక్షలు వాయిదా

నివర్ తుఫాన్ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుంది. తమిళనాడు - పుదుచ్చేరి మధ్య, పుదుచ్చేరి దగ్గర లో బుధవారం రాత్రి 11:30 నంచి ఈ రోజు తెల్లవారుజామున 2:30 గంటల మధ్య తీరం దాటింది.

నివర్ తుఫాన్ ఎఫెక్ట్: రాయలసీమలో వర్ష బీభత్సం.. రాకపోకలు బంద్.. బీఈడీ, ఎంఈడీ పరీక్షలు వాయిదా
Follow us

|

Updated on: Nov 26, 2020 | 9:10 AM

నివర్ తుఫాన్ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుంది. తమిళనాడు – పుదుచ్చేరి మధ్య, పుదుచ్చేరి దగ్గర లో బుధవారం రాత్రి 11:30 నంచి ఈ రోజు తెల్లవారుజామున 2:30 గంటల మధ్య తీరం దాటింది. తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కడప జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. వర్షాలకారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు చోట్ల చెట్లు నేల కూలి విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నివర్ తుఫాన్ కారణంగా  యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలో నేడు జరగాల్సిన బిఈడీ, ఎంఈడీ పరీక్షలు, సమాధాన పత్రాల మూల్యాంకనం వాయిదా వేస్తున్నట్లు వైవీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పి.పద్మ వెల్లడించారు. తుఫాను కారణంగా ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండలని అధికారులు సూచిస్తున్నారు.