AP SEC: ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌కు నిమ్మగడ్డ లేఖ.. అధికారుల బదిలీపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ..

Nimmagadda Ramesh Letter To AP CS: ఏపీ ఎలక్షన్‌ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌కు లేఖ రాశారు. అధికారుల బదిలీపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిమ్మగడ్డ లేఖలో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను సీఎస్‌ పాటించలేదని నిమ్మగడ్డ తెలిపారు...

AP SEC: ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌కు నిమ్మగడ్డ లేఖ.. అధికారుల బదిలీపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ..
Follow us

|

Updated on: Jan 31, 2021 | 8:36 PM

Nimmagadda Ramesh Letter To AP CS: ఏపీ ఎలక్షన్‌ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌కు లేఖ రాశారు. అధికారుల బదిలీపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిమ్మగడ్డ లేఖలో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను సీఎస్‌ పాటించలేదని నిమ్మగడ్డ తెలిపారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్ల నియామక ప్రతిపాదనలను నిమ్మగడ్డ ఈ లేఖలో ప్రస్తావించారు. ఈ రెండు జిల్లాల కలెక్టర్ల బదిలీలపై కోర్టు ఆదేశాలను, ఎలక్షన్‌ కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నిమ్మగడ్డ నాలుగు పేజీల లేఖలో పేర్కొన్నారు. గత మార్చిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన అల్లర్ల కారణంగా ఈ ఇద్దరు కలెక్టర్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

నిమ్మగడ్డ పర్యటన..

ఇదిలా ఉంటే సోమ, మంగళ వారాల్లో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌.. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఇక ఫిబ్రవరి 3, 4న చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో పర్యటిస్తారు. ఈ క్రమంలో ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో నిమ్మగడ్డ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

Also Read: AP Local Body Elections Updates: ఏపీలో రసవత్తరంగా పంచాయతీ పోరు.. ముగిసిన తొలిదశ నామినేషన్ల పర్వం..