Andhra Pradesh: తస్మాత్ జాగ్రత్త.. వెలుగులోకి కొత్త రకం దొంగతనాలు.!
Andhra Pradesh: పశ్చిమగోదావరి జిల్లాల్లో దొంగలు కొత్త స్టైల్లో దొంగతనాలు మొదలెట్టారు. అయితే సాధారణంగా దొంగలు డబ్బులు,
Andhra Pradesh: పశ్చిమగోదావరి జిల్లాల్లో దొంగలు కొత్త స్టైల్లో దొంగతనాలు మొదలెట్టారు. అయితే సాధారణంగా దొంగలు డబ్బులు, బంగారు, వెండి నగలు దోచుకెళ్తుంటారు. ఇక్కడ మాత్రం అవేమీ టచ్ చేయరు. ఓన్లీ గ్యాస్ సిలిండర్లే టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకు ఇలా గ్యాస్ సిలిండర్ దొంగతనం చేస్తున్నారో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో సుమారు 200 పైచిలుకు గ్యాస్ సిలిండర్లు దొంగతనానికి గురి అయ్యాయి. ఒకే రోజు వివిధ ప్రాంతాల్లో ఇంత పెద్దఎత్తున గ్యాస్ సిలిండర్లు చోరీకి గురికావడంతో పోలీసులు విస్మయానికి గురయ్యారు. దీంతో స్థానికులు డబ్బు నగలు కన్నా జాగ్రత్తగా గ్యాస్ సిలిండర్లు కాపాడుకునే పరిస్థితి ఏర్పడింది. చివరకు పోలీసుల ఇళ్లను కూడా వదలకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారంటే ఇక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా గ్యాస్ సిలిండర్ దొంగతనం చేయడం వెనక ఓ పెద్ద ముటా దాగుందా లేక వేరే ఏ కారణం చేతనైనా ఇలా దొంగతనాలు చేస్తున్నారా.? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also read:
Andhra Pradesh: ఏపీలో రాజుకుంటున్న రాజకీయ వేడి.. కొత్త జిల్లాలపై కొనసాగుతున్న ఆందోళనలు..
Andhra Pradesh: దుర్మార్గుడు.. చిన్నారి అనే కనికరం కూడా చూపలేదు.. తమ బంధానికి అడ్డొస్తుందని..!