Andhra Pradesh: దుర్మార్గుడు.. చిన్నారి అనే కనికరం కూడా చూపలేదు.. తమ బంధానికి అడ్డొస్తుందని..!
Andhra Pradesh: విజయనగరంలో చిన్నారుల పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న గుమ్మలక్ష్మీపురం మండలం..
Andhra Pradesh: విజయనగరంలో చిన్నారుల పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న గుమ్మలక్ష్మీపురం మండలం భాలేషు ప్రాథమిక పాఠశాలలో బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుల ఘటన మరువక ముందే మరో హృదయ విధార ఘటన చోటు చేసుకుంది. ఈ సారి లోకం అంటే తెలియని, కష్టం వచ్చినా ఏడుపు తప్ప మరో మాట చెప్పలేని చిన్నారిపై జరిగిన దాడి వెలుగులోకి వచ్చింది. విజయనగరం పట్టణానికి చెందిన బుగత రాముకి, విశాఖ మధురవాడకి చెందిన నాగమణితో వివాహమైంది. పెళ్లి అయ్యి పాప పుట్టిన సంవత్సరానికి ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తి విడిపోయారు. దీంతో నాగమణికి బతుకు భారమైంది. తనతో పాటు చిన్నపాపను పోషించటం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే ఓ పెళ్లిలో నెల్లిమర్లకి చెందిన ఎలక్ట్రిషియన్ చిన్నా తో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. చిన్నా కి పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా నాగమణి మీద మోజుతో విజయనగరం పట్టణంలోని కొత్తపేట సాలివీధిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని కుమార్తెతో ఉన్న నాగమణి ని ఆ ఇంట్లో ఉంచాడు.
ఈ నేపథ్యంలోనే ఓ రోజు నాగమణి తెలిసిన ఇంట్లో శుభకార్యానికి వెళ్తూ చిన్నా దగ్గర ఉంచి వెళ్ళింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న చిన్నా ఆ పాపపై లైంగిక దాడి చేసి విచక్షణా రహితంగా కొరికి తీవ్రంగా దాడి చేశాడు. అలా అప్పటికే పలుమార్లు దాడి చేశాడు. నాగమణి పై కోపమొచ్చినా, వారి మధ్య చిన్నారి అడ్డుగా ఉన్న ప్రతి సారి పాపని కొడుతూ దాడికి పాల్పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 15 న చిన్నా ఆ పాపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అయితే ఒకరోజు నాగమణి కూలీ పనికి వెళ్తూ చిన్నారిని అంగన్వాడీలో వదిలి వెళ్లింది. చిన్నారి ఒంటి పై గాయాలను చూసిన అంగన్వాడీ సిబ్బంది.. వెంటనే అందుబాటులో ఉన్న మహిళా పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న మహిళా పోలీసులు.. డిసిపియూ తో పాటు దిశ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. చిన్నారి పట్ల సైకోలో వ్యవహరించిన చిన్నా పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
Also read: