Anand Mahindra setires: తన కంపెనీపై తానే సెటైర్లు వేసుకున్న ఆనంద్ మహీంద్రా..! తాను అందరిలా కాదంటున్న టెక్ దిగ్గజం..(వీడియో)
Anand Mahindra setires: టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా తాను అందరిలా కాదని మరోసారి నిరూపించుకున్నారు. తన కంపెనీ ప్రొడక్టులపై తానే సెటైర్ వేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ లో ఫిబ్రవరి 4న తన కంపెనీ ప్రొడక్ట్‌కు సంబంధించిన వీడియో ఒకటి పోస్ట్ చేశారు.
టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా తాను అందరిలా కాదని మరోసారి నిరూపించుకున్నారు. తన కంపెనీ ప్రొడక్టులపై తానే సెటైర్ వేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ లో ఫిబ్రవరి 4న తన కంపెనీ ప్రొడక్ట్‌కు సంబంధించిన వీడియో ఒకటి పోస్ట్ చేశారు. ఆ వీడియోలో మహీంద్రా సుప్రో ట్రక్ ఉంది. ఓ గ్రామంలోని పొలాల్లో రైతులు ఆ ట్రక్కుపై భారీ లోడ్ ఎక్కించారు. ట్రక్ డ్రైవర్ ట్రక్ నడుపుతున్నారు. ఈ క్రమంలో ట్రక్కును పొలంలోని ఓ గట్టు ఎక్కించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ఇద్దరు రైతులు ట్రక్ ముందు వేలాడుతుంటే.. ట్రక్ ముందు చక్రాలు రెండూ గాల్లోకి లేచాయి. పుష్ప సినిమాలో లారీ గాల్లోకి ఎగిరిన సీన్ గుర్తొచ్చే రేంజ్ లో ఆ ట్రక్ గాల్లోకి లేచింది. ఆ తర్వాత మళ్లీ ఆ చక్రాలు కిందకు దిగగానే… ముందు వేలాడుతున్న ఇద్దరూ జాగ్రత్తగా కిందకు దిగారు. ఈ పరిస్థితిని చూసిన ఆనంద్ మహీంద్రా… ట్వీట్ ద్వారా తమ కంపెనీ ఇంజినీర్లను తప్పుపట్టారు.”ఆటోమొబైల్ పరిశ్రమ… “క్వాలిటీ ఫంక్షన్ డిప్లాయ్‌మెంట్” (QFD)ని ఉపయోగిస్తుంది. ఇదో నిర్మాణాత్మక విధానం. దీని ద్వారా కస్టమర్లకు ఎలాంటి అవసరాలు ఉంటాయో నిర్వచిస్తారు. ఆ అవసరాల్ని ఆచరణలోకి తెచ్చి… అవసరాలకు తగిన విధంగా ఉత్పత్తుల్ని తయారుచేస్తారు. మా ఇంజినీర్లు మహీంద్రా సుప్రో ట్రక్ ని డిజైన్ చేసేటప్పుడు కస్టమర్ల అవసరాల్ని లెక్కలోకి తీసుకున్నారని నేను నమ్మట్లేదు” అని ట్వీట్ కి కాప్షన్ ఇచ్చిన మహీంద్రా… చివర్లో కళ్లు తిరుగుతున్న ఇమోజీని పోస్ట్ చేశారు. దాంతో ఈవీడియో వైరల్‌గా మారింది. ఒక్క రోజులోనే లక్షలమంది వీక్షించిన నెటిజన్లు రకరకాల ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు. “ఇది పుష్ప మూవీ సీన్” అని ఒకరు స్పందించగా… “రైతు కుటుంబం నుంచి వచ్చాను. రైతుల జీవితాల్లో ఇలాంటి చాలా సాహసాలు ఉంటాయి. పొలాల్లో ఇలాంటివి రోజూ ఉంటాయి. క్షేత్రస్థాయిలో మనం చేయాల్సింది చాలా ఉంది” అని మరో యూజర్ స్పందించారు.
మరిన్ని చూడండి ఇక్కడ: