IndiGo: కర్నూలు ప్రజలకు శుభవార్త… మూడు పట్టణాలకు విమాన సేవలు.. ఎప్పటి నుంచి ప్రారంభమంటే..
Flights between Kurnool and three cities: ప్రముఖ విమానాయ సంస్థ ఇండిగో కర్నూలు ప్రాంత ప్రజలకు శుభవార్త తెలిపింది. కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖ, చెన్నై పట్టణాలకు విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు...

Flights between Kurnool and three cities: ప్రముఖ విమానాయ సంస్థ ఇండిగో కర్నూలు ప్రాంత ప్రజలకు శుభవార్త తెలిపింది. కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖ, చెన్నై పట్టణాలకు విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఇండిగో శుక్రవారం ప్రకటించింది. విమానాయ రంగానికి ఊతమిస్తూ.. సామాన్యులకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి రావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఉడాన్’ పథకంలో భాగంగా ఈ సర్వీసులను ప్రారంభించనున్నారు. మార్చి 28 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయమై ఇండిగో స్ట్రాటజీ, రెవెన్యూ అధికారి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘దక్షిణ భారతదేశంలో రీజినల్ కనెక్టివిటీని పెంచేందుకు ఈ సర్వీసులను ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్- బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌కు అనుమతి లభించిన నేపథ్యంలో రీజినల్ కనెక్టివిటీ అవసరమని మేం భావిస్తున్నామని’ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కొత్తగా ప్రారంభించనున్న బెంగళూరు – కర్నూలు, విశాఖపట్నం – కర్నూలు, చెన్నై – కర్నూలు మార్గాల్లో వారానికి నాలుగు సర్వీసులుంటాయని ఆ సంస్థ ప్రకటించింది.
Also Read: Indian Railways: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. 31 రైల్వే స్టేషన్లు మూసివేత..! ఎందుకంటే?