Nellore Crime: నెల్లూరులో దారుణం..! ఉయ్యాలలో మాయమై నదిలో శవమై తేలిన పసిబిడ్డ

ఉయ్యాలలో నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లిన ఘటన నెల్లూరులో సంచలనంగా మారింది. నాలుగు రోజుల కిందట తల్లి పక్కనే ఉయ్యాలలో నిద్రిస్తున్న ఏడాదిన్నర పసిబిడ్డను దుండగులు ఎత్తుకెళ్లారు. తెల్లారి లేచి చూసేసరికి ఉయ్యాలలో పాప బదులు రెండు బొమ్మలు కనిపించడంతో తల్లి షాక్‌కు గురైంది. చుట్టుపక్కలా..

Nellore Crime: నెల్లూరులో దారుణం..! ఉయ్యాలలో మాయమై నదిలో శవమై తేలిన పసిబిడ్డ
Nellore Crime
Follow us

|

Updated on: Apr 05, 2023 | 11:43 AM

ఉయ్యాలలో నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లిన ఘటన నెల్లూరులో సంచలనంగా మారింది. నాలుగు రోజుల కిందట తల్లి పక్కనే ఉయ్యాలలో నిద్రిస్తున్న ఏడాదిన్నర పసిబిడ్డను దుండగులు ఎత్తుకెళ్లారు. తెల్లారి లేచి చూసేసరికి ఉయ్యాలలో పాప బదులు రెండు బొమ్మలు కనిపించడంతో తల్లి షాక్‌కు గురైంది. చుట్టుపక్కలా వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో కనిపించకుండా పోయిన పాప నదిలో శవమై తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నెల్లూరు జిల్లా ఆదిత్య నగర్ గుర్రాలమడుగు సంఘం నివాసి అనూషకు రాపూరు వాసి మణికంఠతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కృతిక, లక్ష్మీ హారికలు కుమార్తెలు. భర్త మణికంఠ రాపూరులో హోటల్ నిర్వహిస్తుండగా, అనూష ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకుంటోంది. భర్త మణికంఠ రాపూరు నుంచి అప్పుడప్పుడూ వచ్చి భార్యాపిల్లలను చూసి వెళుతుంటాడు. ఆదివారం అనూష తల్లి రాపూరులోని అల్లుడు వద్దకు వెళ్లడంతో ఇద్దరు బిడ్డలతో అనూష పిన్ని ఇంటికి వెళ్లింది. ఏడాదిన్నర బిడ్డ అయిన హారికను ఉయ్యాలలో వేసి, పెద్ద కుమార్తె కృతికతో మంచంపై నిద్రించింది. అర్థరాత్రి 1.30 గంటల సమయంలో అనూష లేచి చూడగా ఊయలలో బిడ్డ నిద్రపోతోంది. ఇంతలో కరెంట్‌ పోవడంతో తలుపులు తీసి పడుకుంది.

తెల్లారి నిద్రలేచి చూడగా బిడ్డకు బదులు ఊయలలో రెండు బొమ్మలు కనిపించాయి. బిడ్డ కనిపించకపోవడంతో తల్ల అనూష తల్లడిల్లిపోయింది. భర్త, తల్లికి సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన బాలాజీనగర్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో చిన్నారి హారిక మృతదేహం సర్వేపల్లి కాలువలో లభ్యం అయ్యింది. బోసినవ్వులు చిందిస్తూ ఇంట్లో సందడి చేసిన తమ పాపాయి విగతజీవిగా తేలడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. మరోవైపు ఈ మిస్సింగ్‌ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రక్తసంబంధికులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..