Andhra Pradesh: క్షణికావేశంలో స్నేహితుడిని చంపిన 8వ తరగతి విద్యార్థి.. ఏపీలో కలకలం..

ఆ పిల్లలిద్దరూ ఫ్రెండ్సే.. ఒకరు ఎనిమిదో తరగతి చదువుతుండగా.. మరొకరు వేరే ప్రాంతంలో కూలీ పనులు చేస్తుంటాడు. ఇద్దరి మధ్య జరిగిన గొడవ.. ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చింది..

Andhra Pradesh: క్షణికావేశంలో స్నేహితుడిని చంపిన 8వ తరగతి విద్యార్థి.. ఏపీలో కలకలం..
Ap Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 05, 2023 | 9:55 AM

ఆ పిల్లలిద్దరూ ఫ్రెండ్సే.. ఒకరు ఎనిమిదో తరగతి చదువుతుండగా.. మరొకరు వేరే ప్రాంతంలో కూలీ పనులు చేస్తుంటాడు. ఇద్దరి మధ్య జరిగిన గొడవ.. ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చింది.. ఇద్దరూ ఒకరినొకరు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఒక బాలుడికి తలపై తీవ్రగాయమవడంతో మరణించాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. ఇద్దరు మైనర్లు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్న ఘటనలో  ఒకరు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన ఇద్దరు బాలురు ఒకే కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే, ఒకరు స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతుండగా.. మృతుడు (17) బెంగుళూరులో భవననిర్మాణ పనులు చేస్తుంటాడు.

అయితే, ఉగాది పండుగ కోసం బెంగళూరులో ఉండే బాలుడు రాయదుర్గానికి వచ్చాడు. అనంతరం ఇద్దరు పిల్లలు కలిసి డాన్స్‌ క్లాసులకు సైతం వెళ్లేవారు. ఈ క్రమంలో బెంగళూరు నుంచి వచ్చిన బాలుడు ఎనిమిదో తరగతి బాలుడిని మాటలతో వేధించి, వెకిలిచేష్టలు చేస్తుండటంతో.. అతను తిరగబడ్డాడు.

అనంతరం, మంగళవారం ఇదే విషయంపై ఇద్దరూ ఘర్షణ పడ్డారు. క్షణికావేశానికి లోనైన 8వ తరగతి చదువుతున్న విద్యార్థి.. సహచర బాలుడిని తలపై కర్రతో కొట్టాడు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి.

ఇవి కూడా చదవండి

గమనించిన స్థానికులు గాయపడిన బాలుడిని అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని.. రాయదుర్గం పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్నారా.. ఈ ప్రాచీన దేవాలయాలపై ఓ లుక్ వేయండి
ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్నారా.. ఈ ప్రాచీన దేవాలయాలపై ఓ లుక్ వేయండి