ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య / తూర్పు గాలులు వీస్తున్నాయి. దక్షిణ బంగాళాఖాతం & ఆనుకుని ఉన్న తూర్పు భూమధ్యరేఖ ,హిందూ మహాసముద్రం మధ్య భాగాలపై అల్పపీడన ప్రాంతం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనము మధ్య ట్రోపో ఆవరణము వరకు కొనసాగుతుంది. ఇది రానున్న 3 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా శ్రీలంక తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. కాగా ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–
ఆది, సోమ, మంగళవారం :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
ఆది, సోమ, మంగళవారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ :-
ఆది, సోమ, మంగళవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
కాగా ఏపీలో పగటి సమయాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, రాత్రి సమయాల్లో బాగా చలిగా ఉండే చాన్స్ ఉందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. ఇక ఏజెన్సీ ప్రాంతాలను ఉదయం మంచు కప్పేస్తుంది. ప్రకృతి అందాలు కనివిందు చేస్తున్నాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం..