AP Election Commissioner : నిమ్మగడ్డ స్థానంలో కొత్త నియామకం, ఏపీ కొత్త ఈసీగా నీలం సాహ్ని
Neelam sahni : ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని నియమితులయ్యారు. రాష్ట్రప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదముద్రవేశారు. ప్రస్తుత ఎన్నికల..
Neelam sahni : ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్రప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదముద్రవేశారు. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో సాహ్ని పదవీ బాధ్యతలు తీసుకుంటారు. నిమ్మగడ్డ పదవీ కాలం ముగుస్తుండటంతో ఏపీ సర్కారు ఈ నియామకం చేపట్టింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య సలహాదారుగా నీలం సాహ్ని ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి ముగ్గురు రిటైర్ట్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. కాగా, 2019 నవంబర్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.
అప్పట్లో ఇలా చాలా కాలం తర్వాత తిరిగి ఏపీకి వచ్చారు నీలం సాహ్ని. ఆమె తొలి పోస్టింగ్ మచిలీపట్నంలోనే జరిగింది. ఆ తర్వాత మళ్లీ సీఎస్ గా సాహ్ని ఏపీకి వచ్చారు. ఇప్పుడ ఏపీ ఈసీగా సేవలు అందించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని నియమితులయి అప్పట్లో ఆమె సరికొత్త ఘనత సాధించారు. అంతకుముందు సాహ్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు.