Viral Video: ప్రేమే జీవితం.. ప్రియుడే సర్వం అనుకుంది.. చివరకు ఇలా రోడ్డుపై కూర్చుంది.. అసలు మ్యాటరేంటంటే!
ప్రేమే జీవితం అనుకుంది.. ప్రేమించిన వాడే సర్వం అని నమ్మింది. కానీ ఆ ప్రేమ ముసుగులోనే నిండా మోసపోతానని గ్రహించలేకపోయింది ఓ యువతి. ఇప్పుడు అదే ప్రేమ కోసం నడిరోడ్డుపై కూర్చొని న్యాయపోరాటం చేస్తుంది. ఇంతకూ ఆమె ఎవరూ, ఇది ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం పదండి.

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మోసం చేశాడని యువకుడు ఇంటి ముందు ధర్నాకు దిగింది ఓ యువతి. తనకు తనకు జరిగిన అన్యాన్ని వెల్లబోసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ రూరల్ పరిధిలోని కాకాని నగర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా కైకలూరుకు చెందిన ఓ యువతికి.. జగ్గయ్యపేటకు చెందిన బాలు సత్యదేవ్ అనే యువకుడితో దాదాపు 13 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. చదువుకునే రోజుల నుంచి మొదలైన ఈ పరిచయం ఆరేళ్లుగా ప్రేమగా మారింది.
అయితే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిన ప్రియుడు ఇటీవల కాలంలో పూర్తిగా మారిపోయాడని బాధితురాలు ఆరోపిస్తుంది. తనతో సరిగ్గా మాట్లాడటం లేదని.. తనను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇంతకాలం తనను ఆదరించిన అతడి కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు తనను దూరం పెడుతున్నారని తెలిపింది.
తన ప్రియుడిని తనకు కాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని, అతనికి వేరే అమ్మాయితో పెళ్లిచేయాలని చూస్తున్నారని ఆరోపించింది. తన జీవితం మొత్తం ఈ ప్రేమ చుట్టూనే తిరిగిందని.. ఇప్పుడు ఇలా వదిలేస్తే తాను ఏమైపోవాలని కన్నీళ్లు పెట్టుకుంది. తన ప్రియుడు తనకు కావాలని తనకు న్యాయం చేయాలని ఏకంగా ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. యువతి ఆందోళనతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




