రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కందికొట్కూరు గ్రామంలో కోతుల బెడద అధికంగా ఉండగా, సర్పంచ్ ఎన్నికలలో చింతలపల్లి విజయమ్మ ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికైన వెంటనే, ఆమె 113 కోతులను గ్రామం నుండి తరలించి అడవిలో వదిలిపెట్టించారు. ఒక్కో కోతికి రూ.500 చెల్లించి నిపుణుల బృందంతో ఈ పని చేయించారు. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.