మహిళలకు గుడ్డు ఒక అద్భుతమైన పోషకాహారం. గుడ్డులోని కోలిన్, విటమిన్ బి-12, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పునరుత్పత్తి అవయవాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుడ్డులోని కొవ్వులు హార్మోన్లను సమతుల్యం చేసి, సకాలంలో పీరియడ్స్ వచ్చేలా చేస్తాయి. ఇది కంటి చూపు, ఎముకల ఆరోగ్యం, మానసిక శ్రేయస్సుకు కూడా దోహదపడుతుంది.