టీడీపీకి భారీ షాక్.. వైసీపీలోకి బాలకృష్ణ క్లోజ్ ఫ్రెండ్

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు క్లోజ్ ఫ్రెండ్ బిగ్ షాక్ ఇచ్చారు. ప్రాణ మిత్రుడు అయిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు టీడీపీని వీడనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో జగన్ సమక్షంలో..

టీడీపీకి భారీ షాక్.. వైసీపీలోకి బాలకృష్ణ క్లోజ్ ఫ్రెండ్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 10, 2020 | 12:33 PM

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు క్లోజ్ ఫ్రెండ్ బిగ్ షాక్ ఇచ్చారు. ప్రాణ మిత్రుడు అయిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు టీడీపీని వీడనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. సినీ నటుడు బాలకృష్ణకు.. బాబురావు స్నేహితుడు కావడంతో బుజ్జగించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కాగా.. బాబూరావు గత అసెంబ్లీ ఎన్నికల నుంచే టీడీపీ అధినేత చంద్రబాబుపై అలక వహిస్తూ వస్తున్నారు. నిజానికి కనిగిరి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఆయన్ని.. 2019 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపారు. దీంతో అప్పటి నుంచి బాబూరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆ తరువాత బాబూరావు కనిగిర సీటు కావాలని స్పష్టం చేశారు. అయితే ఖచ్చితంగా కుదరదని చంద్రబాబు ఖరాఖండిగా చెప్పడంతో ఆయన పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది.

Read More: ఒంటరైన మారుతీరావు భార్య.. నేరం ఎవరిది? శిక్ష ఎవరికి!

శ్మశాన వాటికలో ఉద్రిక్త పరిస్థితులు.. కడసారి చూపుకు నోచుకోని అమృత 

అమృత, ప్రణయ్‌ల లవ్‌స్టోరిపై సినిమా.. హీరో ఎవరంటే?

పొలిటికల్ పార్టీలకు రూ.2,512 కోట్ల విరాళాలు.. ఇచ్చిందెవరో తెలీదు!

నీకు సిగ్గుందా.. అంటూ అమృతపై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్