AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 రోజుల డెడ్‌లైన్.. ఏపీలో పంచాయతీ భవనాలకు కొత్త రంగులు

ప్రభుత్వ కార్యాలయాలకు అధికార వైసీపీ రంగులు వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ ముగిసిన అనంతరం.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పంచాయతీ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు 10 రోజుల్లో  తొలగించాలని  ఆదేశించింది. పంచాయతీ భవనాలు, గవర్నమెంట్ ఆఫీసులకు సీఎస్‌ నిర్ణయం ప్రకారం మళ్లీ రంగులు వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కోర్టు  ఆదేశాలను అమలు చేసినట్లు… ఆధారాలతో సహా నివేదిక  సమర్పించాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా […]

10 రోజుల డెడ్‌లైన్.. ఏపీలో పంచాయతీ భవనాలకు కొత్త రంగులు
Ram Naramaneni
|

Updated on: Mar 10, 2020 | 12:31 PM

Share

ప్రభుత్వ కార్యాలయాలకు అధికార వైసీపీ రంగులు వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ ముగిసిన అనంతరం.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పంచాయతీ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు 10 రోజుల్లో  తొలగించాలని  ఆదేశించింది. పంచాయతీ భవనాలు, గవర్నమెంట్ ఆఫీసులకు సీఎస్‌ నిర్ణయం ప్రకారం మళ్లీ రంగులు వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కోర్టు  ఆదేశాలను అమలు చేసినట్లు… ఆధారాలతో సహా నివేదిక  సమర్పించాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను పురస్కరించుకుని కోర్టు ఈ తీర్పు వెలువరించింది.  పంచాయతీ భవనాలకు రంగులు వేయాలంటూ.. 2018 ఆగస్ట్‌ 11న పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఇచ్చిన మెమోను న్యాయస్థానం రద్దు చేసింది.