Andhra Pradesh: నారావారిపల్లిలో నారా-నందమూరి కుటుంబాల సందడి.. భోగి మంటలతో బాలయ్య సందడి..
ఆ బావా బావమరుదులదే పండగ జోష్ అంతా. ఆ ఊరూ వాడంతా సంక్రాంతి కోలాహలమే కనిపిస్తోంది. మనవడు ప్రత్యేక ఆకర్షణగా.. బాబు, బాలయ్యల సంక్రాంతి సంబరాలు అదిరిపోతున్నాయి.
ఆ బావా బావమరుదులదే పండగ జోష్ అంతా. ఆ ఊరూ వాడంతా సంక్రాంతి కోలాహలమే కనిపిస్తోంది. మనవడు ప్రత్యేక ఆకర్షణగా.. బాబు, బాలయ్యల సంక్రాంతి సంబరాలు అదిరిపోతున్నాయి. అవును, చంద్రబాబు, బాలకృష్ణ రాకతో నారావారిపల్లెలో సందడి నెలకొంది. మూడేళ్ల తర్వాత నారావారిపల్లె వచ్చిన నారా, నందమూరి కుటుంబాలు సంక్రాంతి వేడుకల్లో మునిగితేలుతున్నారు. రెండు కుటుంబాలు కలిసి సంక్రాంతి సంబురాలు జరుపుకుంటున్నారు. చంద్రబాబు, బాలకృష్ణతోపాటు, లోకేష్-బ్రాహ్మణి దంపతులు… వారి కుమారుడు దేవాన్ష్ స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు.
చంద్రబాబు, బాలకృష్ణను చూడటానికి పలకరించడానికి బంధువులు, టీడీపీ శ్రేణులు నారావారిపల్లెకు పోటెత్తుతున్నారు. తనకోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆప్యాయంగా పలకరిస్తూ మాట్లాడుతున్నారు. చంద్రబాబు అయితే, స్థానికులతో ముచ్చటిస్తూ గడుపుతున్నారు. బాలకృష్ణ కోసం వస్తోన్న ఫ్యాన్స్ జైబాలయ్య నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
వీరసింహారెడ్డి సూపర్ సక్సెస్‌తో ఊపు మీదున్న బాలకృష్ణ.. నారావారిపల్లెలో పండగ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇటు బావా బావమరుదులు, అటు మనవడు దేవాన్స్ రాకతో నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబర్నాంటున్నాయ్. భోగి మంటలతో వేడుకలను ఆరంభించారు నారా, నందమూరి కుటుంబాలు. ఈ సందడి అన్‌స్టాపబుల్‌గా మూడ్రోజులపాటు కంటిన్యూ కానుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..