AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అరవింద వారధి వద్ద నక్కపాయకు గండి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..!

ప్రకాశం బ్యారేజ్ నుండి ఎనిమిదిన్నర లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తుండటంతో భారీ వరద లంక గ్రామాలను తాకింది. బాపట్ల జిల్లాలోని కొల్లూరు మండలంలోని పలు లంక గ్రామాలకు వెళ్లే మార్గానికి గండి పడింది. దీంతో తొమ్మిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నక్క పాయ వద్ద గండి పడటంతో భారీ వరద కొల్లూరు కరకట్ట వద్దకు చేరింది.

Andhra Pradesh: అరవింద వారధి వద్ద నక్కపాయకు గండి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..!
Nakkapaya Pond Damaged
T Nagaraju
| Edited By: |

Updated on: Sep 01, 2024 | 7:01 PM

Share

ప్రకాశం బ్యారేజ్ నుండి ఎనిమిదిన్నర లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తుండటంతో భారీ వరద లంక గ్రామాలను తాకింది. బాపట్ల జిల్లాలోని కొల్లూరు మండలంలోని పలు లంక గ్రామాలకు వెళ్లే మార్గానికి గండి పడింది. దీంతో తొమ్మిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నక్క పాయ వద్ద గండి పడటంతో భారీ వరద కొల్లూరు కరకట్ట వద్దకు చేరింది. దీంతో ప్రమాద అంచుకు చేరాయి.

గతంలో నక్క పాయకు పడిన గండికి తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టారు. ఇసుక బస్తాలు వేసి నీటి ప్రవాహాన్ని నివారించారు. అయితే వరద ఉధృతి పెరిగి రోడ్డు మార్గం మొత్తం కూడా కొట్టుకుపోయింది. దీంతో పెసర్లంక, పెదలంక, సుగ్గుణ లంక, ఈపూరు లంక, కనిగిరి లంక, అన్నవరపు లంక, చింతల్లంక,కొత్తూరు లంక, గాజుల్లంక, పొతార్లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయయి. వందలాది ఎకరాలు నీట మునిగాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వీడియో చూడండి..

వరద ముంపు కారణంగా మంత్రులు, అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా గ్రామాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్, బాపట్ల కలెక్టర్ వెంకట మురళి పర్యటించి స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలి రావాలని సూచించారు. అయితే స్థానికులు మాత్రం పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కొల్లూరు నుండి లంక గ్రామాలకు వెళ్లే మార్గంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

2009లో పదిన్నర లక్షల క్యూసెక్కులు నీరు రావడంతో లంక గ్రామాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ప్రస్తుతం ఎనిమిదిన్నర లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ రాత్రికి మరింత నీరు దిగువకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అటు రెవిన్యూ, ఇటు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు స్థానిక సమాచారాన్ని జిల్లా అధికారులకు చేరవేస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్