AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: పెళ్లయిన ఐదేళ్లకు ఆమె కడుపు పండింది.. ఒకే కాన్పులో ముగ్గురు..

ఐదేళ్ల నిరీక్షణ తర్వాత ఆ తల్లి కడుపు పండింది. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో ఆ ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ ఘటన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో చోటుచేసుకుంది.

AP News: పెళ్లయిన ఐదేళ్లకు ఆమె కడుపు పండింది.. ఒకే కాన్పులో ముగ్గురు..
Triplets
Ram Naramaneni
|

Updated on: Sep 01, 2024 | 4:58 PM

Share

ఏపీలో అరుదైన డెలివరీ జరిగింది. మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో ఆ కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. పెళ్లైన 5 ఏళ్ల తర్వాత.. ఆ దంపతులకు పిల్లలు అందడం గమనార్హం.  డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం శారద నర్సింగ్ హోంలో ఈ అరుదైన కాన్పు జరిగింది. డాక్టర్ గిరిబాల, డాక్టర్ శ్రావ్య బృందం ఆ తల్లికి సిజేరియన్ చేసి.. ముగ్గురు పిల్లలకు పురుడు పోశారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా  రాజనగరం మండలం పాత తుంగపాడు గ్రామానికి చెందిన వీరబాబు, ఆలపాటి సంధ్యా కుమారి దంపతులకు 5 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. అప్పట్నుంచి వాళ్లకి పిల్లలు కలగలేదు. వారు తిరగని గుడి లేదు.. సంప్రదించని ఆస్పత్రి లేదు. అయినా ఫలితం దక్కలేదు. రకరకాల ఆస్పత్రులకు వెళ్తున్న క్రమంలో.. రామచంద్రపురం బ్రాడీపేటలో ఉన్న శారద నర్సింగ్ హోంలో చూపించుకున్నారు. అక్కడ డాక్టర్ గిరిబాల ఇచ్చిన సూచనలు పాటించడం.. మందులు వాడటంతో.. సంధ్యా కుమారి కడుపు పండింది. తాజాగా ప్రసవ నొప్పులు రావడంతో తొలుత.. నార్మల్ డెలవరీ కోసం ట్రై చేశారు. కానీ ఇబ్బంది ఉండటంతో.. సిజేరియన్ చేసి.. ముగ్గురు పిల్లలను బయటకు తీశారు వైద్యులు. వారిలో ఇద్దరు మగపిల్లలు కాగా, ఒక ఆడపిల్ల.  తల్లీ పిల్లలు క్షేమంగానే ఉన్నారని డాక్టర్ గిరిబాల తెలిపారు. పిల్లలు ఉండాల్సిన బరువుతోనే పుట్టారని తెలిపారు. ఒక్క బిడ్డ కలిగినా చాలని.. ఎన్నో ఆశలతో ఉన్న ఆ దంపతులకు ఒకే కాన్పులో ముగ్గురు సంతానం కలగటంతో..  ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయి.

దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు