Nagababu: పవన్ ప్రమాణ స్వీకారంపై నాగబాబు ఎమోషనల్ ట్వీట్

ఏపీలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం కూడా అయిన జనసేనాని పవన్ కల్యాణ్ జూన్ 21, శుక్రవారం అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్షణం కోసం పదేళ్లుగా ఎదురుచూస్తున్న ఆయన కుటుంబ సభ్యులు ఈ దృశ్యాల్ని వీక్షించి ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా పవన్ సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అసెంబ్లీ విజిటర్స్ గ్యాలరీ నుంచి నేరుగా పవన్ ప్రమాణాన్ని వీక్షించారు.

Nagababu: పవన్ ప్రమాణ స్వీకారంపై నాగబాబు ఎమోషనల్ ట్వీట్
Naga Babu - Pawan Kalyan
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 21, 2024 | 1:04 PM

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ అసెంబ్లీలో అడుగుపెట్టడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. పదేళ్ల కల నేరవేరింది.. ప్రజాప్రస్థానం మొదలైందంటూ పవన్ అన్నయ్య నాగబాబు ట్వీట్ చేశారు. తోబుట్టుగా.. జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణస్వీకారం చూసి గుండె ఆనందంతో నిండిపోయిందని ఎమోషనల్ ట్వీట్ చేశారు నాగబాబు. డిప్యూటీ సీఎం హోదాలో శాసనసభలో నా తమ్ముడిని చూసి మనసు ఉప్పొంగిందంటూ రాసుకొచ్చారు. అసెంబ్లీ గ్యాలరీలో కూర్చుని ఈ కార్యక్రమం చూడటం చాలా సంతోషంగా ఉందన్నారు నాగబాబు.

కూటమిలో కల్యాణ్ ఘన విజయం సాధించడం మెగా ఫ్యామిలీకి గర్వంగా ఉందని ట్వీట్ చేశారు నాగబాబు. పవన్ అసెంబ్లీకి వెళ్లాలని..పవన్ కల్యాణ్‌ అను నేను అని ప్రమాణస్వీకారం చేయాలనేది తన కల అన్నారు. ఇంతటి అఖండ గెలుపునిచ్చిన ప్రతి ఓటర్ నమ్మకాన్ని పవన్ నిలబెట్టుకుంటారన్నారు. పవన్ నిజాయితీతో, నిష్పక్షపాతంగా, అంతఃకరణ శుద్ధితో తన మంత్రిత్వ శాఖలకు న్యాయం చేస్తాడని నాగబాబు ట్వీట్టర్లో పేర్కొన్నారు.

కాగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ 100 శాతం స్ట్రయిక్ రేట్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. పవన్ పిఠాపురం నుంచి బంపర్ మెజార్టీతో విజయం సాధించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..