AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జల్సాలకు అలవాటు పడ్డ యువకులు.. చోరీ చేసిన వాహనాల్లో గుట్టు చప్పుడు కాకుండా..

జల్సాలకు అలవాటు పడ్డ యువకులు తమ ఆర్థిక అవసరాలకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు.  బైక్‌లు దొంగతనాలు చేసి అదే బైక్‌లపై గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా వై రామవరం మండలం డొంకరాయిలో ఓ మైనర్ బాలుడితో సహా ఐదుగురు యువకులు గంజాయి అక్రమ రవాణా కేసులో అరెస్టు అయ్యారు.

జల్సాలకు అలవాటు పడ్డ యువకులు.. చోరీ చేసిన వాహనాల్లో గుట్టు చప్పుడు కాకుండా..
Ganja Case Arrest
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Jun 21, 2024 | 1:56 PM

Share

జల్సాలకు అలవాటు పడ్డ యువకులు తమ ఆర్థిక అవసరాలకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు.  బైక్‌లు దొంగతనాలు చేసి అదే బైక్‌లపై గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా వై రామవరం మండలం డొంకరాయిలో ఓ మైనర్ బాలుడితో సహా ఐదుగురు యువకులు గంజాయి అక్రమ రవాణా కేసులో అరెస్టు అయ్యారు. వీరి వద్ద నుంచి ఐదు కేజీల గంజాయి, నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనాల్లో మూడు వాహనాలు చోరీకి గురైనవిగా పోలీసులు గుర్తించారు.

వై రామవరం మండలం రాజుక్యాంపుకు చెందిన మండీ వెంకటేష్ తెలంగాణలోని మణుగూరు టౌన్ లో ఐటిఐ చదువుతూ మణుగూరు టౌన్ చెందిన షేక్ సంషీద్, మెరుగు సాయి కృష్ణ, కూకట్ల అఖిల్, పెరుమాళ్ళ జస్వంత్ లతో పరిచయం ఏర్పడింది. వీరు మణుగూరు చుట్టుపక్కల పాడైపోయిన ఫ్యాక్టరీలలో ఐరన్ స్క్రాప్ కాపర్ లారీ బ్యాటరీలను దొంగతనం చేసి జులాయిలుగా తిరుగుతుండేవారు.  వీళ్ళ జల్సాలకు డబ్బులు సరిపోకపోవడంతో ద్విచక్ర వాహనాలు దొంగతనాలు చేసి ఆ వాహనాలపై గంజాయి అక్రమ రవాణాతో  పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు బైక్‌లు దొంగిలించి వాటిపైనే గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు.

కొత్తగూడెంలో రెండు బైకులను చోరీ చేసిన యువకులు.. కూనవరం సమీపంలో మరో బైకును దొంగలించినట్టు తెలిపారు. ఈ వాహనాలపై గంజాయి రవాణా చేసేందుకు సీలేరు వెళ్ళి అక్కడి నుండి ఒడిశాలోని రాస్ బేడ గ్రామానికి వెళ్ళిన యువకులు.. ఐదు కేజీల గంజాయి కొనుగోలు చేసి గంజాయితో మణుగూరు వెళ్లే క్రమంలో డొంకరాయిలో పోలీసులుకు పట్టుబడ్డారు. ఈమేరకు నిందితులను కోర్టుకు తరలించినట్లు తెలిపారు. మైనర్ బాలుడిని జువైనల్ కోర్టుకు తరలించినట్లు తెలిపారు.

Follow Us
ఆరుగురు పతివ్రతలు తర్వాత సినిమాలు అందుకే చేయలేదు..
ఆరుగురు పతివ్రతలు తర్వాత సినిమాలు అందుకే చేయలేదు..
చికెన్ లేకపోతే ఏంటి? ఈ 5 ఫుడ్స్ ప్రోటీన్‌కు బెస్ట్ ఆప్షన్స్
చికెన్ లేకపోతే ఏంటి? ఈ 5 ఫుడ్స్ ప్రోటీన్‌కు బెస్ట్ ఆప్షన్స్
కామద ఏకాదశి.. ఈ వస్తువులు దానం చేశారంటే.. సంపద, ఐశ్వర్యం మీ వెంట
కామద ఏకాదశి.. ఈ వస్తువులు దానం చేశారంటే.. సంపద, ఐశ్వర్యం మీ వెంట
భక్తితో అగ్గిపెట్టెపై రామాయణాన్ని చిత్రీకరించిన కళాకారుడు!
భక్తితో అగ్గిపెట్టెపై రామాయణాన్ని చిత్రీకరించిన కళాకారుడు!
ఆ దేశాన్ని మింగేస్తున్న సముద్రం.. 30 ఏళ్లలో మ్యాప్ నుంచే మాయం..
ఆ దేశాన్ని మింగేస్తున్న సముద్రం.. 30 ఏళ్లలో మ్యాప్ నుంచే మాయం..
అప్పుడే ఓటీటీలోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అప్పుడే ఓటీటీలోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కాశ్మీర్‌ కాదు మన అరకు.. పరవశించిపోయిన పర్యాటకులు.. ఇదిగో వీడియో
కాశ్మీర్‌ కాదు మన అరకు.. పరవశించిపోయిన పర్యాటకులు.. ఇదిగో వీడియో
శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమె..
శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమె..
పెట్రోల్‌పై పన్ను ఎలా విధిస్తారు..? ఎన్ని రకాలుగా ఉంటుంది..?
పెట్రోల్‌పై పన్ను ఎలా విధిస్తారు..? ఎన్ని రకాలుగా ఉంటుంది..?
ప్రకృతినే శాసించ గల శక్తి .. హనుమంతుడికి ఇచ్చింది ఎవరో తెలుసా?
ప్రకృతినే శాసించ గల శక్తి .. హనుమంతుడికి ఇచ్చింది ఎవరో తెలుసా?