Andhra Pradesh: చెరువులో నీటిని అధికారులే ఖాళీ చేయిస్తున్నారు.. ఎందుకో తెలుసా..?

ఎక్కడైనా త్రాగునీరు చెరువు నిండుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మాత్రం వందల ఏళ్ల చరిత్ర కలిగింది. ఆదోని ప్రజల దాహార్తిని తీర్చిన చారిత్రక రామజల చెరువులో ఉన్న నీటిని ఖాళీ చేయడానికి మున్సిపల్ అధికారులు గత 12 రోజులుగా అహర్నిశలు కృషి చేస్తున్నారు.

Andhra Pradesh: చెరువులో నీటిని అధికారులే ఖాళీ చేయిస్తున్నారు.. ఎందుకో తెలుసా..?
Ramajala Lake In Adoni
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 07, 2024 | 6:43 PM

ఎక్కడైనా త్రాగునీరు చెరువు నిండుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మాత్రం వందల ఏళ్ల చరిత్ర కలిగింది. ఆదోని ప్రజల దాహార్తిని తీర్చిన చారిత్రక రామజల చెరువులో ఉన్న నీటిని ఖాళీ చేయడానికి మున్సిపల్ అధికారులు గత 12 రోజులుగా అహర్నిశలు కృషి చేస్తున్నారు.

ఆదోని పట్టణంలో పురాతన రామజల చెరువును బ్రిటిష్ కాలంలో పురుద్దరించి 29 ఎకరాల విస్తీర్ణంలో 1,217 మిలియన్ లీటర్ల నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. అక్కడ నుండి శుద్ది పరిచిన త్రాగు నీరు ఆదోని ప్రజలకు పంపింగ్ చేసేవారు. పెరిగిన జనాభాకు సరిపడ నీరు అందించడానికి 2007 లో బసాపురం వద్ద నిర్మించిన SS ట్యాంక్ తో పాటు రామజల నుండి కూడా త్రాగునీరు సరఫరా జరిగేది. అయితే 2021 ఏప్రిల్లో అరుంధతి నగర్ లో జరిగిన దేవర సందర్భంగా సుమారు 100 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. ఒకరు ప్రాణాలు కూడా కోల్పోయారు.

ఈ సంఘటన జరిగినప్పుడు పరామర్శించడానికి వచ్చిన అప్పటి వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని తో కలుషిత నీరు త్రాగడం వలన ఈ ఘటన జరిగినట్టు బాధితులు పిర్యాదు చేశారు. దాంతో ఆయన ఈ ఘటన పై విచారణకు ఆదేశించారు. ఇక అప్పటి నుండి అధికారుల అవగాహన లోపమో, పాలకుల నిర్లక్ష్యమో గానీ రామజల నుండి త్రాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆదోని ప్రజలు త్రాగు నీటికి తీవ్ర కటకట ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఈ ఏడాది ఏప్రిల్ లో బసాపురం SS ట్యాంక్ పూర్తిగా డ్యామేజ్ కావడంతో త్రాగునీరు పూర్తి స్థాయిలో నిల్వ చేయలేకపోయారు. వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా అప్పటికప్పుడు అధికారుల దృష్టి రామజలపై పడింది. వెంటనే అందులో ఉన్న నీరు పరీక్షలకు పంపిస్తే త్రాగడానికి పనికిరావని నిపుణులు తెలియచేయడంతో వెంటనే నీరు ఖాళీ చేయడానికి చర్యలు చేపట్టారు. ఎన్నికలు సందర్భంగా కమిషనర్ బదిలీ కావడంతో ఆ పని అక్కడే ఆగిపోయింది. ఎన్నికల కార్యక్రమాలు పూర్తయ్యాక ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి రామజల చెరువును పరిశీలించి నీటిని తొలగించే పనిలో పడ్డారు

చెరువులో ఉన్న 850 మిలియన్ లీటర్ల నీరు ఖాళీ చేయడానికి సైపనింగ్ సిస్టం, విద్యుత్ మోటార్ల ద్వారా రోజుకు 22 మిలియన్ లీటర్ల నీరు బయటకి పోతోంది. గత 12 రోజులుగా సుమారు 250 మీ. లీ. నీరు ఖాళీ అవగా మిగిలిన 600 మీ.లీ. నీరు మరో ముప్పై రోజుల్లోగా ఖాళీ చేసి LLC కెనాల్ నుండి పంపింగ్ ద్వారా రామజల చేరువులోకి నీరు నింపాలని భావిస్తున్నారు. అనంతరం శుద్ధి పరిచిన నీటిని ఆదోని లో 17 వార్డుల ప్రజలకు త్రాగునీటి సౌకర్యం అందించే అవకాశం ఉందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..