AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎందుకమ్మా నాపై ఇంత కోపం.. బిడ్డ ఏడుపు ఆపడం లేదని నోరు ముక్కు మూసి.. కసాయి తల్లి దారుణం..

ఎన్నో కష్టాలు పడి.. నవమాసాలు మోసింది.. పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.. అంతా బాగానే ఉంది.. కూతురికి 5 నెలలు.. ఆలనా పాలనా బాగానే చూసుకుంటోంది.. ఈ క్రమంలోనే.. పాప ఎందుకో ఏడుస్తుంది.. దీంతో ఆమెకు కోపం వచ్చింది.. ఆ పసిపాపను సముదాయించడం మరిచి.. ఆమెపైనే కర్కశంగా ప్రవర్తించింది..

ఎందుకమ్మా నాపై ఇంత కోపం.. బిడ్డ ఏడుపు ఆపడం లేదని నోరు ముక్కు మూసి.. కసాయి తల్లి దారుణం..
Tirupati - Mother killed crying baby
Raju M P R
| Edited By: |

Updated on: Mar 26, 2026 | 3:01 PM

Share

ఎన్నో కష్టాలు పడి.. నవమాసాలు మోసింది.. పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.. అంతా బాగానే ఉంది.. కూతురికి 5 నెలలు.. ఆలనా పాలనా బాగానే చూసుకుంటోంది.. ఈ క్రమంలోనే.. పాప ఎందుకో ఏడుస్తుంది.. దీంతో ఆమెకు కోపం వచ్చింది.. ఆ పసిపాపను సముదాయించడం మరిచి.. ఆమెపైనే కర్కశంగా ప్రవర్తించింది.. తరచూ ఏడుస్తుందని.. దారుణ నిర్ణయం తీసుకుంది.. ఏడుపు ఆపడం లేదన్న కోపంతో 5 నెలల పసిబిడ్డ నోరు ముక్కు మూసింది.. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.. కన్న బిడ్డను చంపిన కసాయి తల్లికి సంబంధించిన ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లాలోని సత్యవేడు మండలం ఎన్ఆర్ అగ్రహరంలో జరిగింది. ఏడుపు ఆపడం లేదన్న కోపంతో 5 నెలల పసిబిడ్డ నోరు ముక్కు మూసిన తల్లి పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయేందుకు కారణం అయింది. తల్లి నోరు, ముక్కు మూసేయడంతో ఊపిరాడక పసిబిడ్డ చని పోయింది.

వివరాల ప్రకారం.. ఎన్ఆర్ అగ్రహరంలో నివసిస్తున్న వెంకటేష్, హేమావతికి ఏడేళ్ల క్రితం పెళ్లి జరగింది.. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. ఐదేళ్ల కొడుకుతో పాటు ఐదు నెలల కూతురు కూడా ఉంది. అయితే పెళ్ళైన నాటి నుంచి భార్యా భర్తలు హేమావతి, వెంకటేష్ ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు పేర్కొంటున్నారు.

ఈ విషయంపై ఎప్పుడూ కోపంగా ఉండే హైమావతి కన్నబిడ్డ ఏడ్పును భరించలేక పోయింది. ఎప్పుడూ ఏడ్చే బిడ్డ ఏడ్పు ఆపేందుకు ప్రయత్నించిన తల్లి హేమావతి నోటిని ముక్కును చేత్తో గట్టిగా నొక్కి పెట్టింది. దీంతో 5 నెలల పసికందు ఊపిరాడక చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు.. అనంతరం పోలీసులు హేమవతిని అదుపులోకి తీసుకున్నారు. హేమావతిని విచారించిన పోలీసులు కన్నతల్లే కసాయి గా మారిందని గుర్తించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us