Telangana: విద్యార్థులకు ఇక పండగే.. మధ్యాహ్న భోజనంలో నోరూరించే కొత్త ఐటమ్!
రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థుల్లో పౌష్ఠికాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ఇకపై చేపల కూరను కూడా అందించనున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా పిల్లలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు తిలాపియా చేపలను ప్రత్యేకంగా పెంచి పాఠశాలలకు సరఫరా చేయనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరిం ప్రకటించారు.

విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తును అందించేందుకు విద్యావ్యవస్థలో సీఎం రేవంత్ సర్కార్ సరికొత్త మార్పులను చేస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవల పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్‌ఫాస్ట్‌లను కూడా అందించేందుకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజనంలో ఇప్పటి వరకు సన్నబియ్యం, గుడ్లను అందిస్తున్న ప్రభుత్వం ఇకపై నుంచి చేపల కూరను కూడా వడ్డించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉంటే తలాపియా చేపలను ప్రత్యేకంగా పెంచి రాష్ట్రంలోని పాఠశాలలకు పంపిణీ చేయనున్నట్టు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. విద్యార్థులలో పౌష్ఠికాహార లోపాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన అసెంబ్లీ వేదికగా తెలిపారు.
పశుసంవర్ధక, మత్స్య, క్రీడల శాఖలపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ మంత్రి వాకిటీ శ్రీహారి రాష్ట్రంలోని ప్రభుత్వం పాఠశాల్లలోని మధ్యాహ్న భోజన పథకంలో చేపల కర్రీ అందిస్తామని తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే కేబినెట్‌లో కూడా చర్చించామని, త్వరలోనే దీన్ని అందుబాటులోకి తెస్తామన్నారు.
తినేప్పుడు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు తిలాపియా అనే ప్రత్యేక జాతికి చెందిన చేపలను ప్రత్యేకంగా పెంచి పాఠశాలలకు సరఫరా చేపిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో టాప్‌లో నిలిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అంతేకాదు గ్రామస్థాయిలో క్రీడలను బలోపేతానికి కూడా ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నట్టు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
