ఆపిల్ పండు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్ని పండ్లలో చాలా మంది ఇష్టపడే దానిలో ఇదే ముందుంటుంది.
ప్రతి ఒక్కరూ ఆపిల్ పండును చాలా ఇష్టంగా తింటారు. అంతే కాకుండా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు కూడా వీటిని కొనుగోలు చేసి తింటారు.
ఆపిల్ పండులో పోషకాలు ఎక్కువగా ఉండటం వలన ప్రతి ఒక్కరూ వీటిని తినాలంటారు. వైద్య నిపుణులు కూడా రోజుకు ఒక ఆపిల్ పండు తినాలంటారు.
అయితే ఆపిల్ పండు ఆరోగ్యానికి చాలా మేలు చేసినప్పటికీ, కొందరు దీనిని అతిగా తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలే మంచిదికాదంటున్నారు నిపుణులు.
ఆపిల్ పండు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఏ విధంగా చూసినా ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనాలు అంందిసస్తుంది. కానీ ఈ సమస్యలు ఉన్నవారు దీనిని తినకూడదంట.
వీలైనంత వరకు డయాబెటీస్ సమస్యలు ఉన్నవారు ఆపిల్ పండుకు చాలా దూరం ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. లేకపోతే ఇది అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది.
అలాగే దంత సమస్యలు ఉన్నవారు కూడా ఎక్కువగా ఆపిల్ పండ్లు తినకూడదంట. అలాగే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు కూడా తీసుకోకూడదంట.
రాత్రి సమయంలో ఖాళీ కడుపుతో అస్సలే ఆపిల్ పండ్లు తినకూడదు. దీని వలన గ్యాస్, ఎసిడిటీ సమస్యల ఎక్కువ అవుతుంది. అలాగే అలర్జీ ఉన్నవారు కూడా దీనికి దూరం ఉండటం మంచిది.