AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చుక్క కూరతో ఇలా రోటి పచ్చడి చేస్తే రెండు ప్లేట్స్ ఎక్కువే లాగిస్తారు

Chukka Kura Roti Pachadi: చుక్క కూర రోటి పచ్చడి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా తింటారు. పాత రోజుల్లో ఏ పచ్చడి అయినా రోటిలోనే చేసే వాళ్ళు. ఇప్పుడు అంటే మిక్సీలో చేస్తున్నారు. ఈ పచ్చడిని రోటిలో చేసుకుంటే టేస్ట్ అదిరిపోతోంది.

Prasanna Yadla
|

Updated on: Mar 26, 2026 | 1:18 PM

Share
కావాల్సిన పదార్ధాలు : రెండు కట్టలు చుక్క కూర , మూడు టమాటాలు, 4 పచ్చి మిర్చి,  10 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరను, నూనెను  తీసుకోవాలి.

1 / 5

ముందుగా చుక్క కూరను తీసుకుని శుభ్రం చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని తేమ లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. ఇప్పుడు పచ్చి మిర్చిని కూడా కడిగి ముక్కలు వేసి పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఆ తర్వాత పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి దానిలో కొద్దిగాఆయిల్ వేసి చుక్కకూర ఆకులు, టమాటాలు ముక్కలు, పచ్చి మిర్చిని వేసి  బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత వీటిని తీసుకుని రోటిలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

3 / 5
రోటిలో నూరే టప్పుడు మధ్యలో కొద్దిగా ఉప్పు, చింతపండు వేసి దంచాలి. ఆ తర్వాత  వెల్లుల్లి రెబ్బలు కూడా  దంచుకోవాలి. అలాగే, రుచికి సరిపడా ఉప్పు దీనిని ఒక ప్లేట్ లేదా  గిన్నెలోకి తీసుకోవాలి.

4 / 5
చుక్క కూర రోటి పచ్చడి నూరిన తర్వాత దీనిలో నిమ్మరసాన్ని కూడా కలుపుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. మంట ఎక్కువగా ఉంటె ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే మంట తగ్గుతుంది. అంతే వేడి వేడి చుక్క రోటి పచ్చడి రెడీ.

5 / 5
Follow Us