AP Rains: మండుటెండల్లో కూల్.. కూల్‌గా.. ఏపీలో ఈ ప్రాంతాలకు వర్షాలు.. పూర్తి వివరాలు
ఏపీలో వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి. వచ్చే మూడు రోజుల్లో వాతావరణం ఇలా ఉండనుందని వైజాగ్ వాతావరణ కేంద్రం తెలిపింది. మండుటెండల్లో వర్షాలు పడనున్నాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.! ఓ సారి ఇక్కడ లుక్కేయండి మరి.

ఒడిశా మధ్య ప్రాంతాల నుంచి దక్షిణ విదర్భ వరకు దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఏర్పడిన ద్రోణి బలహీనపడినది. దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ & యానాంలలో దక్షిణ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి..
—————————————————————————————————-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
—————————————————-
ఈరోజు, రేపు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం లేదు.
ఎల్లుండి:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం లేదు. ఈదురుగాలులు గంటకు 40 – 50 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- —————————————-
ఈరోజు, రేపు: పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం లేదు.
ఎల్లుండి:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం లేదు. ఈదురు గాలులు గంటకు 40 – 50 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.
రాయలసీమ :- ————————-

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..