మండలిలో నెంబర్ గేమ్‌కు ముందే.. టీడీపీకి ఎమ్మెల్సీ ఝలక్..!

రాజధాని మార్పు బిల్లుపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ బిల్లు శాసనసభలో ఆమోదం పొందగా.. ఇప్పుడు మండలిలో గట్టెక్కాల్సి ఉంది. అయితే మండలిలో ప్రభుత్వానికి సరైన బలం లేకపోవడంతో.. జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లు సంకేతాలందాయి. అయితే ఇదిలా ఉంటే ప్రభుత్వం మాత్రం.. మండలిలో కూడా బిల్లును ఆమోదింపచేసేందుకు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మండలిలో బలంగా ఉందన్న టీడీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, […]

మండలిలో నెంబర్ గేమ్‌కు ముందే.. టీడీపీకి ఎమ్మెల్సీ ఝలక్..!

రాజధాని మార్పు బిల్లుపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ బిల్లు శాసనసభలో ఆమోదం పొందగా.. ఇప్పుడు మండలిలో గట్టెక్కాల్సి ఉంది. అయితే మండలిలో ప్రభుత్వానికి సరైన బలం లేకపోవడంతో.. జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లు సంకేతాలందాయి. అయితే ఇదిలా ఉంటే ప్రభుత్వం మాత్రం.. మండలిలో కూడా బిల్లును ఆమోదింపచేసేందుకు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మండలిలో బలంగా ఉందన్న టీడీపీకి భారీ షాక్ తగిలింది.
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, తన శాసన మండలి పదవికి రాజీనామా చేశారు. మండలిలో అధిక సంఖ్యా బలం ఉన్న టీడీపీ, మూడు రాజధానుల బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో సభ్యులంతా హాజరు కావాలని విప్ కూడా జారీ చేసింది. ఈ సమయంలోనే డొక్కా గైర్హాజరయ్యారు. అంతేకాదు.. తన పదవికి రాజీనామా చేస్తున్నానని, అనారోగ్య కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ రాజీనామా లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.