ప్రతి నిర్ణయం.. ప్రజా వ్యతిరేకమే.. జగన్‌పై కన్నా సంచలన కామెంట్స్..

రాజధాని మార్పు అంశం ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తోంది. సీఎం జగన్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ప్రజా వ్యతిరేక నిర్ణయమేనన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో పడిన బాధలను ఇప్పుడు ప్రజలపై రుద్దుతున్నారన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు మంచి చేస్తానంటూ హామీ ఇచ్చి.. అధికారంలోకి రాగానే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. నియంతృత్వ పోకడలతో జగన్ పాలన కొనసాగుతుందన్నారు. తాను తీసుకుంటున్న పిచ్చి నిర్ణయాలకు కేంద్రం సహకారం ఉందంటూ […]

ప్రతి నిర్ణయం.. ప్రజా వ్యతిరేకమే.. జగన్‌పై కన్నా సంచలన కామెంట్స్..
Follow us

| Edited By:

Updated on: Jan 21, 2020 | 1:11 PM

రాజధాని మార్పు అంశం ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తోంది. సీఎం జగన్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ప్రజా వ్యతిరేక నిర్ణయమేనన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో పడిన బాధలను ఇప్పుడు ప్రజలపై రుద్దుతున్నారన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు మంచి చేస్తానంటూ హామీ ఇచ్చి.. అధికారంలోకి రాగానే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. నియంతృత్వ పోకడలతో జగన్ పాలన కొనసాగుతుందన్నారు. తాను తీసుకుంటున్న పిచ్చి నిర్ణయాలకు కేంద్రం సహకారం ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2019లో టీడీపీకి పట్టిన గతే 2024లో వైసీపీకి కూడా పడుతుందంటూ జోస్యం చెప్పారు.

ఇక మూడు రాజధానుల నిర్ణయం సరైందికాదన్నారు కన్నా. రాజధాని మార్పు అంశానికి జగన్ భూదందానే కారణమన్నారు. అమరావతి మార్పుకి ఖర్చు ఒక్కటే కారణం కాదని.. గతంలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని. ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా అలాగే చేయాలని చూస్తొందన్నారు. తొలుత ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ చెప్పింది బీజేపీనే అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతలను అభివృద్ధి చేసే చిత్తశుద్ధి బీజేపీకి మాత్రేమే ఉందని.. ఇడుపులపాయలో రూ. 1400 కోట్లు కేటాయించిన వైసీపీ..రూ. 1000 కోట్లు ఉత్తరాంధ్రకి ఇవ్వాలి కదా అంటూ ప్రశ్నించారు.