బ్రేకింగ్: బెజవాడలో అప్రకటిత కర్ఫ్యూస్.. ప్రజల ఆగ్రహం

విజయవాడలో పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నగరంలో ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు. ప్రకాశం బ్యారేజి, బెంజ్ సర్కిల్, ధర్నాచౌక్‌తో పాటు, తాడేపల్లి, ఉండవల్లి వద్ద పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే స్కూల్, కాలేజీ విద్యార్థులు పరీక్షలు ఉన్నాయని చెప్పినప్పటికీ వారిని విజయవాడ వైపు వెళ్లడానికి అనుమతి నిరాకరిస్తున్నారు పోలీసులు. దీంతో విద్యార్థులు సతమతమవుతున్నారు. కేవలం విజయవాడ నుంచి తాడేపల్లికి వెళ్లే వాహనాలకు మాత్రమే అనుతిస్తున్నారు. కాగా.. ప్రకాశం నుంచి విజయవాడకి వెళ్లే […]

బ్రేకింగ్: బెజవాడలో అప్రకటిత కర్ఫ్యూస్.. ప్రజల ఆగ్రహం
Follow us

| Edited By:

Updated on: Jan 21, 2020 | 12:53 PM

విజయవాడలో పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నగరంలో ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు. ప్రకాశం బ్యారేజి, బెంజ్ సర్కిల్, ధర్నాచౌక్‌తో పాటు, తాడేపల్లి, ఉండవల్లి వద్ద పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే స్కూల్, కాలేజీ విద్యార్థులు పరీక్షలు ఉన్నాయని చెప్పినప్పటికీ వారిని విజయవాడ వైపు వెళ్లడానికి అనుమతి నిరాకరిస్తున్నారు పోలీసులు. దీంతో విద్యార్థులు సతమతమవుతున్నారు. కేవలం విజయవాడ నుంచి తాడేపల్లికి వెళ్లే వాహనాలకు మాత్రమే అనుతిస్తున్నారు. కాగా.. ప్రకాశం నుంచి విజయవాడకి వెళ్లే భారీ వాహనాలు, బైక్‌లను తప్పించి, కేవలం ఆర్టీసీ బస్సులను మాత్రమే అధికారులు అనుమతిచ్చారు. దీంతో.. ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఆంక్షల వల్ల ముఖ్యమైన పనులు వాయిదాలు వేసుకోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు.