మళ్లీ క్రిష్ గురించి నోరు జారిన కంగనా.. ఏమందంటే!

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.. డైరెక్టర్ క్రిష్‌పై మరోసారి నోరు జారింది. వీరిద్దరూ ‘మణికర్ణిక: ఝాన్సీ కీ రాణి’ సినిమాకి కలిసి పనిచేశారు. అయితే కొన్ని తగాదాల కారణంగా మధ్యలోనే ఈ చిత్రం నుంచి వచ్చేశారు క్రిష్. అనంతరం కంగనా ఈ సినిమా పూర్తి చేసింది. అయితే ఈ సినిమా విడుదల సందర్బంగా.. ఇటు క్రిష్, అటు కంగనా ఇద్దరూ హాట్ హాట్ కామెంట్స్ చేసుకున్నారు. సినిమా నేను మాత్రమే పూర్తి చేశానని, క్రిష్ అసలు ఏమీ […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:06 am, Tue, 21 January 20
మళ్లీ క్రిష్ గురించి నోరు జారిన కంగనా.. ఏమందంటే!

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.. డైరెక్టర్ క్రిష్‌పై మరోసారి నోరు జారింది. వీరిద్దరూ ‘మణికర్ణిక: ఝాన్సీ కీ రాణి’ సినిమాకి కలిసి పనిచేశారు. అయితే కొన్ని తగాదాల కారణంగా మధ్యలోనే ఈ చిత్రం నుంచి వచ్చేశారు క్రిష్. అనంతరం కంగనా ఈ సినిమా పూర్తి చేసింది. అయితే ఈ సినిమా విడుదల సందర్బంగా.. ఇటు క్రిష్, అటు కంగనా ఇద్దరూ హాట్ హాట్ కామెంట్స్ చేసుకున్నారు. సినిమా నేను మాత్రమే పూర్తి చేశానని, క్రిష్ అసలు ఏమీ చేయలేదని ఆమె వ్యాఖ్యానించారు. దీనిపై క్రిష్ కూడా కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఇది ముగిసిపోయిన వ్యవహారమే అయినా.. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యల వల్ల మళ్లీ ఈ ఇష్యూ తెరపైకి వచ్చింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ.. ‘క్రిష్ మణికర్ణిక సినిమా నుంచి మధ్యలోనే తప్పుకున్నారు. అనంతరం నేను ఆ సినిమాకి దర్వకత్వ బాధ్యతలను వహించాను. మొత్తానికి అనుకున్న సమయానికి నేను సినిమా పూర్తి చేశా.  అది మంచి విజయం అందుకుంది. అందుకు దర్శక, నిర్మాతలు నన్ను మెచ్చకోవల్సింది పోయి.. ఇష్టమొచ్చినట్లు తిట్టారు. దానికి నేను షాక్ అయ్యాను. సెట్‌లో ఎలాంటి నటులకైనా గౌరవం ఉండాలనుకుంటారు. నిజానికి ఇండియాలో నటీనటులకు ఉండే విలువ డైరెక్టర్లకు ఉండదని’ కంగనా మళ్లీ కామెంట్స్ చేసింది.

కాగా… కంగన చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని, ఏడాది క్రితమే క్రిష్ క్లారిటీ ఇచ్చేశారు. చరిత్రలో ఝాన్సీ లక్ష్మీబాయి గురించి ఉన్నది ఉన్నట్లుగా చూపించడం పోయి.. కంగనా మార్పులు చేయాలనుకున్నారు. అందులోనూ.. ఆమె సెట్స్‌లో డైరెక్టర్‌గా వ్యవహరించడం సోనూసూద్‌తో పాటు నాకూ నచ్చలేదు. అందుకే ఆ సినిమా నుంచి మధ్యలోనే తప్పుకున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు. అలాగే ఇంకెప్పుడూ కంనగతో కలిసి పనిచేయనని క్రిష్ తేల్చి చెప్పేశారు.