MLA Roja: కోనసీమలో సందడి చేసిన ఎమ్మెల్యే, సినీనటి రోజా.. పంటు పడవపై ప్రయాణిస్తూ..
MLA Roja: కోనసీమలో నగరి ఎమ్మెల్యే, సినీ నటి రోజా సందడి చేశారు. ఆమె శనివారం తూర్పుగోదావరి జిల్లాలోని పలు దేవాలయాలను సందర్శించి
MLA Roja: కోనసీమలో నగరి ఎమ్మెల్యే, సినీ నటి రోజా సందడి చేశారు. ఆమె శనివారం తూర్పుగోదావరి జిల్లాలోని పలు దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అందులో భాగంగా కోనసీమకు వస్తూ గోదావరిలో పంటు పడవపై ప్రయాణిస్తూ గోదావరి అందాలను తిలకించారు. కోటిపల్లి – ముక్తేశ్వరం గోదావరి నదిలో పంటు పడవపై ప్రయాణిస్తూ సందడి చేశారు. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో ముచ్చటించారు. గోదావరిలో మరో పంటూలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు హాయ్ చెపుతూ పలకరించారు. అనంతరం పంటు లోంచి గోదావరి అందాలను ఆస్వాదిస్తూ ముక్తేశ్వరం రేవులో దిగి ఇసుక తెన్నెలలో నడుచుకుంటూ ప్రకృతి అందాలను తిలకించారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ కొనసీమకు ఎన్ని సార్లు వచ్చిన ఆ ఆనందం చెప్పలేనిదని అందుకే అవకాశం దొరికినప్పుడల్లా కొనసీమకు వస్తూ ఉంటానని అన్నారు. కోనసీమ అందాలు ప్రకృతి సహజ సిద్ధంగా ఉండే అందాలని వీటికి ఎవరైనా మంత్రముగ్ధులు అవ్వాల్సిందే అన్నారు. కాగా.. రోజాను చూసేందుకు స్థానికులు అక్కడికి భారీగా చేరుకున్నారు.
రోజా శనివారం ఉదయం నుంచి జిల్లాలోని పలు శైవ క్షేత్రాలతో పాటు పలు ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ద్రాక్షరామం, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని సైతం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
Also Read: