AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP Gorantla: గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం జగన్‌.. వీడియో నిజమైతే చర్యలు తప్పవన్న సజ్జల

వీడియోలు వైరల్ అయిన సంఘటనపై దర్యాప్తు చేస్తామని సిఐ రాఘవన్ చెబుతున్నారు. మరోవైపు ఈ సంఘటన మాధవ్ అభిమానులను, కుటుంబ సభ్యులను కలిచివేసిందని కొందరు వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

MP Gorantla: గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం జగన్‌.. వీడియో నిజమైతే చర్యలు తప్పవన్న సజ్జల
Mp Gorantla Madhav
Surya Kala
|

Updated on: Aug 04, 2022 | 5:52 PM

Share

MP Gorantla Madhav: హిందూపురం(Hindupuram) ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వైరల్ (Viral Video) ఘటనపై సీఎం జగన్ సహా ప్రభుత్వ చీప్ విప్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. గోరంట్ల వ్యవహారంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. మరోవైపు గోరంట్ల మాధవ్ అంశం విచారణ లో తేలుతుందని చెప్పారు. ఒక ప్రైవేట్ అంశం బయట వైరల్ అయిందని అన్నారు. అయితే తనది ఫేక్ వీడియో అంటూ ఎంపీ గోరంట్ల ఆ విషయాన్ని ఖండించారని గుర్తు చేశారు. ఎంపీ వీడియోపై చట్ట ప్రకారం విచారణ జరుగుతుందన్నారు. అసాంఘిక వ్యవహారం వైరల్ అయితే తక్కువ మాట్లాడి చర్యలు ఎక్కువ ఉండాలన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఒక మహిళా పక్ష పాతి పార్టీ గా గోరంట్ల వ్యవహారం నిజమైతే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

మరోవైపు ఎంపీ గోరంట్ల మాధవ్ అనుచరులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ సంఘటనపై అనంతపురం 2టౌన్ (Anantapuram 11 Town) పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ నాయకుని పరువుకు భంగం కలిగించే విధంగా నగ్నంగా వీడియోలు వైరల్ చేశారని ఫిర్యాదు చేశారు. వీడియోలు వైరల్ అయిన సంఘటనపై దర్యాప్తు చేస్తామని సిఐ రాఘవన్ చెబుతున్నారు. మరోవైపు ఈ సంఘటన మాధవ్ అభిమానులను, కుటుంబ సభ్యులను కలిచివేసిందని కొందరు వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనుక ఎవరున్నారో పోలీసులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. నిజా నిజాలు వెలుగులోకి వస్తాయి అభిమానులు ఎవరు ఆందోళన చెందవద్దని.. పోలీసులు వాస్తవాలు వెలుగులోకి తెచ్చే వరకు ఎవరు ఈ సంఘటనపై స్పందించవద్దని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..