AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్నూలులో 80 శాతం పంచాయతీలు వైసీపీవే.. ఎన్నికలు రావాలని తెగ ఊగారు.. ఎన్ని గెలుస్తారని మంత్రి అనిల్‌ సవాల్‌

కర్నూలు జిల్లా నంద్యాలలో పంచాయతి ఎన్నికల సందడి మొదలైంది. జిల్లా ఇన్‌ఛార్జి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధ్వర్యంలో..

కర్నూలులో 80 శాతం పంచాయతీలు వైసీపీవే.. ఎన్నికలు రావాలని తెగ ఊగారు.. ఎన్ని గెలుస్తారని మంత్రి అనిల్‌ సవాల్‌
K Sammaiah
|

Updated on: Jan 28, 2021 | 6:51 PM

Share

కర్నూలు జిల్లా నంద్యాలలో పంచాయతి ఎన్నికల సందడి మొదలైంది. జిల్లా ఇన్‌ఛార్జి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధ్వర్యంలో ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నివాసంలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఎమ్మెల్యే తో ఒక్కొక్కరితో ప్రత్యేకంగా సమావేసమైన మంత్రి అనిల్‌కుమార్‌ ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగించినట్లు తెలుస్తుంది. జిల్లాలో 80శాతం పైగా సీట్లు సాదించే విధంగా ముందుకు వెళ్ళాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలకు మంత్రిఅనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. ఎన్నికల్లో సత్తా చూపిస్తామంటూ ఊర్రూతలు ఊగారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, ఏం చేస్తారో.. ఎన్ని గెలుస్తారో చూపించండి అంటూ మంత్రి సవాల్‌ విసిరారు. ప్రదాన ప్రతిపక్ష పార్టీకి కనీసం 25శాతం సీట్లు సాధించే సత్తా ఉందా అంటూ ఎద్దేవా చేశారు.

కొన్ని తోక పార్టీలకు 5శాతం సీట్లు సాధించే సత్తా లేదని వ్యాఖ్యానించారు. కనీసం నామినేషన్ వేసే శక్తి, ధైర్యం లేక అనవసరంగా మాట్లడుతున్నారని మంత్రి ఘాటుగా స్పందించారు. నంద్యాల విజయ డైరీ ఎన్నికల్లో 80 శాతం ఓట్లతో గెలిచాం, అలాగే 80శాతం పంచాయతి సీట్లు ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని మంత్రి అనిల్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.

స్థానిక సంస్థ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఏపీ సీఎస్ లేఖ.. ఎన్నికలు

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే