Visakhapatnam: హాట్ టాపిక్ గా మారిన త్రీ క్యాపిటల్స్ ఇష్యూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన మంత్రి అమర్నాథ్..

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఇష్యూ.. రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని అధికార పార్టీ నేతలు, మంత్రులు చెబుతుంటే.. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే...

Visakhapatnam: హాట్ టాపిక్ గా మారిన త్రీ క్యాపిటల్స్ ఇష్యూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన మంత్రి అమర్నాథ్..
Gudivada Amarnath
Follow us

|

Updated on: Jan 21, 2023 | 4:27 PM

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఇష్యూ.. రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని అధికార పార్టీ నేతలు, మంత్రులు చెబుతుంటే.. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు మంత్రులు చేస్తున్న కామెంట్స్ పొలిటికల్ హీట్ పెంచాయి. తాజాగా ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అలాంటి కీలక వ్యాఖ్యలే చేశారు. మరో రెండు నెలల్లో విశాఖ ఏపీకి పరిపాలన రాజధాని కాబోతోందన్నారు. ఏదేమైనా ఈ ప్రాంతాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. విశాఖలో జరిగిన ఇన్ఫినిటి వైజాగ్‌ సదస్సులో మంత్రి మాట్లాడారు. త్వరలో ఇన్ఫోసిస్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తామన్న మంత్రి అమర్నాథ్.. దేశంలోని ధనిక నగరాల్లో విశాఖ తొమ్మిదో స్థానంలో ఉందని చెప్పారు. త్వరలో అదాని డేటా సెంటర్‌ను ప్రారంభిస్తామని, విశాఖను ఐటీ హబ్‌ చేయడమే తమ లక్ష్యం అని ఉద్ఘాటించారు.

గతంలోనూ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ రాజధానిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రెండు, మూడు నెలల్లోనే విశాఖ పరిపాలన రాజధాని కాబోతోందన్నారు. సీఎం జగన్ కూడా విశాఖలోనే ఉంటారన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ఫిబ్రవరిలోగా శంకుస్థాపన చేస్తామని చెప్పారు. కొత్త ఏడాదిలో మరింత అభివృద్ధి జరగాలని వెల్లడించారు. విశాఖను ఏపీ పరిపాలన రాజధాని చేయడం వైసీపీ ప్రభుత్వ విధానమని తెలిపారు.

కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధాని నగరాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర మంత్రి మండలి అభివృద్ధి వికేంద్రీకరణ, సమ్మిళిత అభివృద్ధి బిల్లు 2020 ను అసెంబ్లీ ఆమోదించింది. విశాఖపట్నాన్ని పరిపాలన, అమరావతిని శాసన, కర్నూలును న్యాయ రాజధానులుగా పరిగణించనున్నారు. సెక్రటేరియేట్, గవర్నర్ కార్యాలయం విశాఖపట్నంలో ఏర్పాటవుతాయి, అసెంబ్లీ అమరావతిలో, హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేస్తామని వైసీపీ ప్రభుత్వం తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇక.. అప్పటి నుంచి రాజుకున్న మూడు రాజధానుల గొడవ ఇప్పటికీ చల్లారడం లేదు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఎలా ఏర్పాటు చేస్తారని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. మూడు రాజధానులతోనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి జరుగుతుందా అని నిలదీస్తున్నారు. మరోవైపు.. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, పాదయాత్రలు చేపట్టారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి