Rain Alert: ఇప్పట్లో వదలనంటోన్న వర్షం.. మరో ఐదు రోజులు వానలే వానలు.

ఉదయం ఎండ రాత్రి కాగానే వర్షం ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అకాల వర్షం చేతికొచ్చిన పంటలను నాశనం చేస్తూ బీభత్సం సృష్టించింది. అయితే ఈ వానలు ఇప్పట్లో ఆగవని వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మరో మరో ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. విదర్భ నుంచి ఉత్తర..

Rain Alert: ఇప్పట్లో వదలనంటోన్న వర్షం.. మరో ఐదు రోజులు వానలే వానలు.
AP Rains
Follow us
Narender Vaitla

|

Updated on: May 02, 2023 | 2:38 PM

ఉదయం ఎండ రాత్రి కాగానే వర్షం ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అకాల వర్షం చేతికొచ్చిన పంటలను నాశనం చేస్తూ బీభత్సం సృష్టించింది. అయితే ఈ వానలు ఇప్పట్లో ఆగవని వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మరో మరో ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ కర్ణాటక వరకు కొనసాగుతున్న ద్రోణి, దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉన్న ఉపరితల ద్రోణి కారణంగా రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

పలు చోట్ల ఉరుములు మెరుపలు ఈదురు గాలులు కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే గడచిన 24 గంటల్లో సూళ్లూరుపేటలో 9 సెంటీమీటర్లు, తెర్లాంలో 8 సెంటీమీటర్లు, గూడూరులో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయి. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక గురవారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకటి, రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే ఈదురు గాలులు (గంటకు 30-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

దక్షిణ కోస్తాలో మంగళవారం, బుధవారంలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక శుక్రవారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 30-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

రాయలసీమలో మంగళవారం, బుధవారాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక శుక్రవారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..