Andhra Pradesh: అమారావతిలో మెగా రెసిడెన్షియల్ జోన్.. 48 వేలకు పైగా ఇళ్ల నిర్మాణాలు
అమరావతిలో మెగా రెసిడెన్షియల్ జోన్ ఆవిష్కృతం కాబోతోంది. వెయ్యో రెండు వేలో కాదు... 48వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి అడుగుపడబోతోంది. హైకోర్టు అలా క్లియరెన్స్ ఇచ్చిందో లేదో శరవేగంగా R5 జోన్‌లో జెట్ స్పీడ్‌తో ప్లాటింగ్ చేస్తున్నారు అధికారులు.
అమరావతిలో మెగా రెసిడెన్షియల్ జోన్ ఆవిష్కృతం కాబోతోంది. వెయ్యో రెండు వేలో కాదు… 48వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి అడుగుపడబోతోంది. హైకోర్టు అలా క్లియరెన్స్ ఇచ్చిందో లేదో శరవేగంగా R5 జోన్‌లో జెట్ స్పీడ్‌తో ప్లాటింగ్ చేస్తున్నారు అధికారులు. 6 గ్రామాలకు 1134 ఎకరాల్లో ఒక్కో లబ్ధిదారనికి 52 గజాల ఫ్లాట్ అందిచనున్నారు. యుద్ధప్రాతిపదికన భూమి చదునుచేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. R5 జోన్‌లో రోడ్లు, సరిహద్దు రాళ్లు, ప్లాట్లకు నెంబర్లు లాంటి పనులు జరుగుతున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. నాలుగైదు రోజుల్లో పనులు మొత్తం పూర్తిచేసి, సీఎం జగన్ చేతులు మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీకి సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఓవైపు R5 జోన్‌లో జెట్ స్పీడ్‌లో ప్లాటింగ్ జరుగుతుంటే, ఇంకోవైపు నిరసనలు హోరెత్తుతున్నాయ్. CRDA మాస్టర్ ప్లాన్ ప్రకారం కేటాయించిన 5శాతం భూముల్లోనే పేదలకు పట్టాలు ఇవ్వాలంటున్నారు. రైతుల భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడం అన్యాయమని, దీనిపై సుప్రీంకు వెళ్తామని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా గుంటూరు, కృష్ణాజిల్లాల్లోని 48వేల 218మందికి R5 జోన్‌లో ఇళ్ల స్థలాలు ఇవ్వబోతోంది ప్రభుత్వం. కృష్ణాయపాలెంలో 72 ఎకరాలు, నిడమర్రులో 670 ఎకరాలు, కురగల్లులో 38 ఎకరాలు, మందడంలో 66 ఎకరాలు, ఐనవోలులో 53 ఎకరాలు, నవులూరులో 233 ఎకరాలు కేటాయించింది.