AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: ప్రైవేటు ల్యాబ్‌లల్లో అదనపు వసూళ్లు.. బెజవాడలో ముమ్మరంగా తనిఖీలు..

Medical health department: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శనివారం ల్యాబ్‌లపై మెరుపుదాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు

Vijayawada: ప్రైవేటు ల్యాబ్‌లల్లో అదనపు వసూళ్లు.. బెజవాడలో ముమ్మరంగా తనిఖీలు..
Medical Health Department
Shaik Madar Saheb
|

Updated on: Jan 22, 2022 | 10:46 AM

Share

Medical health department: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శనివారం ల్యాబ్‌లపై మెరుపుదాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ల్యాబ్‌లల్లో క్షణ్ణంగా తనిఖీలు నిర్వహించి జరిమానాలు సైతం విధించారు. విజయవాడ డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ సిబ్బంది మెడికల్ ల్యాబ్ లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. 7 బృందాలుగా నగరంలోని ఏడు ల్యాబ్‌లల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. అపోలో లేబరేటరీ, రేమిడీస్ లాబొరేటరీస్, ఏ.బి.సి డయాగ్నొస్టిక్ సెంటర్, ఐరిష్ లాబొరేటరీ, ఓమిక్రాన్ డయాగ్నొస్టిక్ సెంటర్, సాయి బాలాజీ డయాగ్నొస్టిక్ సెంటర్, కామినేని హాస్పిటల్‌లోని ల్యాబ్‌లో తనిఖీలు నిర్వహించారు. ఏడు లేబరేటరీలో మూడు లేబొరేటరీలు ఆర్.టి.పి.సి.ఆర్ పరీక్షలకు నిబంధనలకు విరుద్ధంగా పాత ఫీజులను వసూలు చేస్తున్నట్లు గుర్తించారు.

ఒమిక్రాన్ లాబరేటరీ 67 మంది వద్ద ఒక్కొక్కరికి 149 చప్పున 9,983 అదనపు వసూళ్లు చేసినట్లు గుర్తించారు. సాయిబాలాజీ లేబొరేటరీ 307 మంది వద్ద అదనంగా 149 చొప్పున 45,743, కామినేని హాస్పిటల్ 97 మంది వద్ద ఒక్కొక్కరికి అదనంగా 149 చొప్పున అదనంగా 14,453 వసూళ్లు జరిపినట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. అదనపు మొత్తము తిరిగి చెల్లించిన పత్రాలను డీఎంహెచ్ఓకు ఇవ్వాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

అపోలో లాబరేటరీ సాధారణ లాబరేటరీ లైసెన్స్‌తో హై ఎండ్ ల్యాబరేటరీను నిర్వహిస్తున్నట్టు తనిఖీ బృందాలు గుర్తించాయి. హై ఎండ్ లేబొరేటరీ నిర్వహణకు 10,000 రుసుము చెల్లించి అనుమతి పొందాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు అధికారులు అపోలో లేబరేటరీకి 20,000 జరిమానా విధించారు.

Also Read:

Co-WIN portal: కోవిన్ పోర్టల్ సురక్షితం.. ఎలాంటి డేటా లీక్ కాలేదు.. స్పష్టం చేసిన కేంద్రం

India Coronavirus: దేశంలో కొనసాగుతున్న కరోనా కల్లోలం.. గత 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..