Kodi Pandalu: పశ్చిమలో ఓ వైపు కోడి పందాలపై ఆంక్షలు.. మరోవైపు లక్షల్లో పుంజుల ధరలు.. చేతులు మారుతున్న కోట్ల రూపాయలు

ప్రతి సంవత్సరం సంక్రాంతి మూడు రోజులు కనిపించే కోడిపందాల జోరు ఈ సంవత్సరం నూతన సంవత్సరానికి ముందే కనిపిస్తుంది. పందెం రాయుళ్లు నొట్ల కట్టలు రెడీ చేసుకోవడం తో పాటు కోడి పుంజులను సమాయత్తం చేస్తున్నారు.

Kodi Pandalu: పశ్చిమలో ఓ వైపు కోడి పందాలపై ఆంక్షలు.. మరోవైపు లక్షల్లో పుంజుల ధరలు.. చేతులు మారుతున్న కోట్ల రూపాయలు
Cock Fight In West Godavari
Follow us

|

Updated on: Dec 24, 2022 | 4:48 PM

పశ్చిమలో పందెం కోళ్లు కాలు దువ్వుతున్నాయి. సంక్రాంతి కి సిద్ధం మైనట్లు రెక్కలు కొట్టి జూలు విదిలిస్తున్నాయి. మరో వైపు పశ్చిమ లో బరులకు బేరాలు సైతం లక్షల్లో జరుగుతున్నాయి. ఐపియల్ లో క్రికెటర్ల వేలం మాదిరి పందెం బరులకు సైలెంట్గా లక్షల్లో అగ్రిమెంట్లు జరిగిపోతున్నాయి. పశ్చిమ కోడిపందాలపై జిల్లా కలెక్టర్ ఆంక్షలు విధించారు.. అంతేకాదు పండగ సమయంలో 144 సెక్షన్ కూడా అమలు లో ఉండనుందని ముందుగానే అధికారులను అప్రమత్తం చేశారు. మరోవైపు పందెంరాయుళ్లు జోరుగా బెట్టింగులతో రెడీ అవుతున్నారు.

ప్రతి సంవత్సరం సంక్రాంతి మూడు రోజులు కనిపించే కోడిపందాల జోరు ఈ సంవత్సరం నూతన సంవత్సరానికి ముందే కనిపిస్తుంది. పందెం రాయుళ్లు నొట్ల కట్టలు రెడీ చేసుకోవడం తో పాటు కోడి పుంజులను సమాయత్తం చేస్తున్నారు. అంతేకాదు పందాలకు బరులను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ఆంక్షలు ఉన్న గత సంవత్సరం కన్నా రెట్టించిన ఉత్సాహంతో కోడిపందాలు నిర్వహించేందుకు పందెం రాయుళ్లు సిద్ధమవుతున్నారు. ఇక పందెం కోడి లక్ష నుంచి ఐదు లక్షల ధర పలుకుతోంది. అడ్వాన్స్ లు చెల్లించి కోడిపుంజులు దొడ్ల వద్ధ అడ్వాన్స్ కొనుగోళ్లు అమ్మకాలు జరుగుతున్నాయి. రకాన్ని బట్టి పందెం కోడిపుంజులు ధరలు పలుకుతున్నాయి.

కోడిపందాలు జోరుగా సాగేందుకు రాష్ట్రం నలుమూలల నుండి పందెం రాయుళ్లు ను ఎవరిని ఆహ్వానించాలి, చీఫ్ గెస్ట్లు గా ఎవరిని పిలవాలి వచ్చిన పందెం రాయుల్లకు,గెస్ట్లకు వసతి సౌకర్యం , భోజనం ఏర్పాట్లు ఎక్కడ నిర్వహించాలి అన్న బిజీలో ఉన్నారు పందాల నిర్వహకులు. భీమవరం పాలకొల్లు నర్సాపురం, తణుకు, తాడేపల్లి గూడెం లలో లాడ్జిలు బుక్ అయ్యాయి. సంక్రాంతి ఐదు రోజులు ముందే నుంచే ఇక్కడ లాడ్జిలు హౌస్ ఫుల్ అయిపోయాయి. ప్రభుత్వ ఆంక్షలు ఎన్నున్నా సంక్రాంతి మూడు రోజులు గతంలో కన్నా మిన్నగా కోడిపందాలు నిర్వహిస్తామని కోడిపందాల నిర్వాహకులు చెబుతున్నారు. ఆంక్షల పేరుతో అడ్డంకులు స్రృష్టించవద్ధని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరో పక్క పందాలకు కోడిపుంజులను జీడిపప్పు , బాదంపప్పు కైమా, గుడ్లు పెట్టి మేపుతున్నారు పందాలు రాయుళ్లు, అంతే కాదు వాటికి రోజు స్విమ్మింగ్ వాకింగ్ వంటి ఎక్సర్సైజులు కూడా చేయిస్తున్నారు పందెం పుంజుల యజమానులు. ఏడాదికి ఒకసారి జరిగే సాంప్రదాయ కోడిపందాలకు తాము సంవత్సరమంతా తమ కోడిపుంజులను మంచి పౌష్టికాహారం పెట్టి వ్యాయామం చేయిస్తూ పందాలకు సిద్ధం చేస్తామని కోడిపుంజుల యజమానులు చెబుతున్నారు. కుక్కుట శాస్త్రం మేరకు కోళ్లను పందెం బరిలో దించుతామని చెబుతున్నారు. ఈ యేడాది ఏ కోడి పందెం కొడుతుంది అన్నీ లెక్కలు వేస్తారు పందెంరాయుళ్లు.

ప్రతి సంవత్సరంలా కోడిపందాలపై పోలీసులు విధించే ఆంక్షలు ఈ సంవత్సరం కూడా విధించి పండగ మూడు రోజులు సాంప్రదాయ కోడి పందాలకు రాజకీయ నాయకుల ఒత్తిడితో పత్తా లేకుండా పోతారో.. లేక కోడిపందాలను సమర్ధవంతంగా అడ్డుకుంటారో మరికొద్ది రోజులు వేచి చూడాలి.

Report: Ravi

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.