Andhra Pradesh: ప్రేమించుకుని 5 నెలల క్రితం పెళ్లి.. వద్దన్నా బయటకెళ్లిన భర్తపై కోపంతో భార్య ఆత్మహత్య..

అతని పేరు నాగూర్ భాషా.. ఆమె పేరు జోత్న్స.. వీరివురూ కల్యాణి నగర్ లో నివస్తున్నారు. ఇద్దరూ కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. వృత్తిలో భాగంగా ఏర్పడిన పరిచయం ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. ఇరు కుటుంబాలు కూడా ఒప్పుకోవడంతో ఐదు నెలల క్రితం ఇద్దరూ వివాహం చేసుకున్నారు.  ఇద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. అయితే ఒక చిన్న ఘటన ఇద్దరి జీవితాల్లోనూ తీరని శోకాన్ని మిగిల్చింది.

Andhra Pradesh: ప్రేమించుకుని 5 నెలల క్రితం పెళ్లి.. వద్దన్నా బయటకెళ్లిన భర్తపై కోపంతో భార్య ఆత్మహత్య..
Andhra Pradesh
Follow us
T Nagaraju

| Edited By: Surya Kala

Updated on: Nov 17, 2023 | 12:59 PM

భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజమే.. అయితే ప్రస్తుత కాలంలో చిన్న చిన్న గొడవలకే భార్య భర్తలు విడిపోవడం చూస్తున్నాం. మరికొంతమంది అయితే ఏకంగా బలమన్మరణాలకు పాల్పడుతున్నారు. అటువంటి ఘటనే గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కలకాలం కలిసి ఉండాలని ప్రమాణం చేసుకున్నారు. కానీ బయటకు వెళ్ల వద్దని చెప్పినా భర్త వెళ్లాడని ఏకంగా ఓ ఇల్లాలు ఆత్మహత్యకు పాల్పడింది.

అతని పేరు నాగూర్ భాషా.. ఆమె పేరు జోత్న్స.. వీరివురూ కల్యాణి నగర్ లో నివస్తున్నారు. ఇద్దరూ కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. వృత్తిలో భాగంగా ఏర్పడిన పరిచయం ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. ఇరు కుటుంబాలు కూడా ఒప్పుకోవడంతో ఐదు నెలల క్రితం ఇద్దరూ వివాహం చేసుకున్నారు.  ఇద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. అయితే ఒక చిన్న ఘటన ఇద్దరి జీవితాల్లోనూ తీరని శోకాన్ని మిగిల్చింది.

బుధవారం ఇంటిలో నుండి బయటకు వెళ్లివస్తానని భాషా భార్య జోత్న్సకు చెప్పాడు. అయితే జోత్న్స ఈ రోజు ఇంటిలో నుండి బయటకు వెళ్లవద్దని చెప్పింది. అయితే భాషా తనకు పనుందని బయటకు వెళ్లి వస్తానని పట్టుబట్టాడు. భార్య వద్దంటున్న వినకుండా బయటకు వెళ్లాడు. దీంతో జోత్న్స తీవ్ర మనస్థాపానికి గురైంది.

ఇవి కూడా చదవండి

బయటకు వెళ్లిన నాగూర్ భాషా సాయంత్రం వరకూ ఇంటికి రాలేదు. ఈ క్రమంలోనే జోత్స్న తల్లి ఫోన్ చేసింది. అయితే జోత్న్స ఫోన్ తీయలేదు. అనుమానం వచ్చిన ఆమె వెంటనే అల్లుడికి ఫోన్ చేసి చెప్పింది. దీంతో నాగూర్ భాషా ఉరుకులు, పరుగులతో ఇంటికి వచ్చాడు. తలుపు కొట్టిన తలుపు తీయలేదు. దీంతో అనుమానం వచ్చి స్థానికులతో కలిసి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళాడు.

అప్పటికే జోత్స్న ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించనట్లు వైద్యులు చెప్పారు. చిన్న విషయానికే జోత్స్న ఆత్మహత్య చేసుకోవడాన్ని అటు భర్త నాగూర్ భాషా, ఇటు జోత్న్స తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!