Nagula Chavithi: ఏపీలో ఘనంగా నాగుల చవితి వేడుకలు.. సుబ్రమణ్య స్వామి ఆలయాలు, పుట్టల వద్ద పాలు పోస్తున్న భక్తులు
ఈ నేపథ్యంలో కార్తీక మాసంలో దీపావళి పండగ తర్వాత వచ్చే చతుర్థి తిథిని నాగుల చవితిగా భావించి ఆ రోజు నాగులకు పూజ చేస్తారు. తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న నాగుల చవితి పండగను ఆంధ్రప్రదేశ్ లోని ఘనంగా జరుపుకుంటున్నారు. పుట్టలో పాలు పోయడమే కాదు.. నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మమణ్యేశ్వర స్వామీ ఆలయాలకు భక్తులకు పోటెత్తుతున్నారు.
ప్రకృతిని పూజించే సంస్కృతి హిందువులది. సృష్టిలో ప్రతిజీవిలో దైవం చూడమనేది హైందవ జీవన విధానంలో ముఖ్య భాగం. ఈ నేపథ్యంలో కార్తీక మాసంలో దీపావళి పండగ తర్వాత వచ్చే చతుర్థి తిథిని నాగుల చవితిగా భావించి ఆ రోజు నాగులకు పూజ చేస్తారు. తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న నాగుల చవితి పండగను ఆంధ్రప్రదేశ్ లోని ఘనంగా జరుపుకుంటున్నారు. పుట్టలో పాలు పోయడమే కాదు.. నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మమణ్యేశ్వర స్వామీ ఆలయాలకు భక్తులకు పోటెత్తుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నాగుల చవితి వేడుకలను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు.
కాకినాడలో శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న పుట్ట వద్ద భక్తుల సందడి నెలకొంది. పుట్టలో పాలు పోసి నాగేంద్రుడిని భక్తితో వేడుకుంటున్నారు. తమ తాత, ముత్తాతల నుండి దీపావళి వెళ్లిన 5వ రోజున నాగుల చవితి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని గుర్తు చేసుకున్నారు.
మరోవైపు రాజమండ్రిలోని సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగసర్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సుబ్రమణ్యేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలని జరుపుతున్నారు భక్తులు అంతేకాదు పొలం వద్ద ఉండే పుట్టల దగ్గరకు వెళ్లి ప్రత్యేక పూజలను చేసి పాలు పోస్తున్నారు. చలిమిడి, నువ్వులతో చేసిన చిమ్మిలిని నైవేద్యంగా సమర్పిస్తున్నారు.
అంతేకాదు ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ సుబ్రహమణ్యేశ్వర క్షేత్రం మోపిదేవిలో నాగుల సందడి నెలకొంది. కుటుంబ సమేతంగా పుట్టలో పాలు పోసి నాగుల చవితి ని ప్రారంభించారు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. మోపిదేవిలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకున్న ఆలయ అధికారులు ఎటువంటి ఇబ్బంది ఏర్పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే పుట్టలో పాలు పోసేందుకు క్యూ లైన్ లలో భక్తులు బారులు తీరారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..