AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tulsi Vivah 2023: పెళ్లి ఆలస్యం అవుతుందా.. తులసి కళ్యాణం చేసి చూడండి.. ఈ ఏడాది ఎప్పుడు వచ్చిదంటే..

హిందూ పంచాంగం ప్రకారం తులసి వివాహం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్షం ఏకాదశి తిథి తర్వాత రోజున జరుపుకుంటారు. ఈ రోజున దేశవ్యాప్తంగా తులసి వివాహాన్ని ఘనంగా నిర్వహిస్తారు. దీనితో పాటు వివాహం మొదలైన శుభకార్యాలకు కూడా శుభ ముహూర్తం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం తులసి వివాహం ఎప్పుడు జరుపుకోవాలి..  ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.

Tulsi Vivah 2023: పెళ్లి ఆలస్యం అవుతుందా.. తులసి కళ్యాణం చేసి చూడండి.. ఈ ఏడాది ఎప్పుడు వచ్చిదంటే..
Tulasi Vivaham
Follow us
Surya Kala

|

Updated on: Nov 17, 2023 | 9:10 AM

కార్తీక మాసం అంటేనే ఆధ్యాత్మిక మాసం.. పూజ నెల. శివ కేశవులను అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఇక ఈ నెలలో చేసే తులసి వివాహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువు ..  శాలిగ్రామ స్వరూపంతో తులసిని వివాహం చేసుకున్నాడని పురాణాల కథనం.. ఆ ఆచారం నేటికీ కొనసాగుతోడ్ని. ఈ రోజున ఎవరైతే తులసి మాత వివాహాన్ని శుభ సమయంలో జరుపుతారో వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలు నెలకొంటాయని విశ్వాసం. కోరిన కోరికలన్నీ నెరవేరి సంతానం పొందే వరం కూడా లభిస్తుంది.

హిందూ పంచాంగం ప్రకారం తులసి వివాహం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్షం ఏకాదశి తిథి తర్వాత రోజున జరుపుకుంటారు. ఈ రోజున దేశవ్యాప్తంగా తులసి వివాహాన్ని ఘనంగా నిర్వహిస్తారు. దీనితో పాటు వివాహం మొదలైన శుభకార్యాలకు కూడా శుభ ముహూర్తం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం తులసి వివాహం ఎప్పుడు జరుపుకోవాలి..  ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.

తులసి వివాహం ఎప్పుడు జరుపుకోవాలంటే..?

తులసి వివాహం ఈ ఏడాది ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం ఏకాదశి తిథి నవంబర్ 23న .. ద్వాదశి తిథి మర్నాడు నవంబర్ 24న వచ్చింది. దీంతో ఏకాదశి ఉపవాసం ఉండి.. ద్వాదశి తిథి రోజున ఇంట్లో తులసి మాతకు,  శాలిగ్రామ స్వామివారి కళ్యాణం నిర్వహించే ఆచారం ఉంది. ఇలా చేయడం వల్ల మనిషి జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు లభిస్తాయని చెబుతారు.

ఇవి కూడా చదవండి

తులసి వివాహానికి శుభ సమయం

కార్తీక మాసంలోని శుక్ల పక్షం ద్వాదశి రోజున తులసి కళ్యాణం నిర్వహిస్తారు. పంచాంగం ప్రకారం నవంబర్ 23, గురువారం రాత్రి 9.01 గంటలకు ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. నవంబర్ 24, శుక్రవారం రాత్రి 7:06 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయతిథిని దృష్టిలో ఉంచుకుని తులసి వివాహాన్ని నవంబర్ 24న మాత్రమే జరుపుతారు. ఈ శుభ సమయంలో ఇంట్లో తులసి-శాలిగ్రామ కళ్యాణం నిర్వహించడం ద్వారా ఇంట్లో సుఖ సంతోషలు నెలకొంటాయని.. వైవాహిక జీవితంలోఆనందం లభిస్తుందని విశ్వాసం.

తులసి వివాహం ప్రాముఖ్యత:

హిందూ సనాతన ధర్మంలో తులసి వివాహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా, శాలిగ్రామాన్ని శ్రీమహావిష్ణువు అవతారంగా భావించి వివాహం నిర్వహిస్తారు. ఈ రోజున తులసి-శాలిగ్రామ వివాహాన్ని ఆచారాల ప్రకారం నిర్వహించడం వల్ల జీవితంలో సానుకూలత ఏర్పడుతుందని  నమ్ముతారు. అంతేకాకుండా వివాహానికి సంబంధించిన అడ్డంకులు కూడా తొలగిపోతాయని విశ్వాసం. జీవితంలో ఒక్కసారైనా తులసి కళ్యాణం శాస్త్రోక్తంగా చేస్తే కన్యాదానం చేసినంత ఫలితాలు లభిస్తాయని చెబుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు