AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: మంగినపూడి బీచ్ అరుదైన అవకాశం.. బ్లూ ఫ్లాగ్ బీచ్‌ల జాబితాలో ఏపీ నుంచి రెండోదిగా..

Vijayawada: ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక ఎకో లేబుల్. ఈ గుర్తింపు పొందటం అంత సులభం ఏమి కాదు...డెన్మార్క్ కు చెందిన F.E.E అనే సంస్థ ఈ సర్టిఫికెట్ ఇస్తుంది. ఈ ట్యాగ్ ఎంతో ప్రత్యేకమైనది. ఈ ట్యాగ్ లైన్ ఉన్న బీచ్ లకు పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ట్యాగ్ ఇవ్వాలంటే ఆ సంస్థ చాల కఠినమైన పరీక్షలే పెడుతుంది 33 అంశాలను పరిశీలించిన తర్వాత వాటిలో పాస్ అయితే..

Vijayawada: మంగినపూడి బీచ్ అరుదైన అవకాశం.. బ్లూ ఫ్లాగ్ బీచ్‌ల జాబితాలో ఏపీ నుంచి రెండోదిగా..
Manginapudi Beach
P Kranthi Prasanna
| Edited By: |

Updated on: Jul 30, 2023 | 5:05 PM

Share

విజయవాడ, జూలై 30: కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్‌కు అరుదైన అవకాశం దక్కింది.  పర్యాటక శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 జిలాల్లో 373 అభివృద్ధి చేయదగిన బీచ్‌లను గుర్తించింది. అందులో 8 బీచ్‌లను బ్లూ ప్లాగ్ బీచ్‌లుగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించటం.. వాటిల్లో మంగినపూడి బీచ్ కూడా ఉండటంతో జిల్లా వాసులు గర్వంగా ఫీల్ అవుతున్నారు. మన రాష్ట్రానికి చెందిన ఈ జాబితాలో రుషికొండ బీచ్ ఇప్పటికే ఉండగా తాజాగా మంగినిపూడి బీచ్ కూడా చేరింది.

బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ అంటే ఏంటి

ఇది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక ఎకో లేబుల్. ఈ గుర్తింపు పొందటం అంత సులభం ఏమి కాదు…డెన్మార్క్ కు చెందిన F.E.E అనే సంస్థ ఈ సర్టిఫికెట్ ఇస్తుంది. ఈ ట్యాగ్ ఎంతో ప్రత్యేకమైనది. ఈ ట్యాగ్ లైన్ ఉన్న బీచ్ లకు పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ట్యాగ్ ఇవ్వాలంటే ఆ సంస్థ చాల కఠినమైన పరీక్షలే పెడుతుంది 33 అంశాలను పరిశీలించిన తర్వాత వాటిలో పాస్ అయితే కానీ ఈ సర్టిఫికెట్ రాదు. పర్యావరణం, నీటి నాణ్యత ,నిర్వహణ, పరిశుభ్రత, భద్రతా..ఇలా రకరకాల అంశాలను పరిశీలించి అత్యంత పరిశుభ్రమైనదిగా పరిగణిస్తూ ఈ ఎకో ట్యాగ్ లైన్ అయినా బ్లూ ఫ్లాగ్ బీచ్ అనే లోగోని ఇస్తుంది.

మరింత సుందరంగా తయారుకానున్న మంగినపూడి బీచ్

పరిశుభ్రమైన బీచ్ ల లిస్ట్ లోకి చేరిన మంగినపూడి బీచ్ అభివృద్ధి పనులకు ఇప్పటికే 50 లక్షల రూపాయలు నిధులు కేంద్రం నుండి మంజూరయ్యాయి. త్వరలో మరింత సుందరంగా తయారుకానున్న ఈ బీచ్ లో వాటర్ స్పాట్స్ కూడా పారంభం కానుంది. ఇప్పటికే దీనికోసం టెండర్లు వేశారు అధికారులు. ఇక్కడ చారిత్రాత్మక మైన ఓడ రేవు కూడా ఉంది. అక్కట్టుకునే నీరు నల్లని రంగుతో వుండే మట్టి చక్కటి పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీ మొబైల్‌లో డార్క్ మోడ్ బ్యాటరీ లైఫ్ పెంచదా? ఆశ్చర్యపోయే కారణాలు
మీ మొబైల్‌లో డార్క్ మోడ్ బ్యాటరీ లైఫ్ పెంచదా? ఆశ్చర్యపోయే కారణాలు
కొత్త సంవత్సరంలో వారికి ప్రేమ, పెళ్లి ప్రయత్నాల్లో విజయం!
కొత్త సంవత్సరంలో వారికి ప్రేమ, పెళ్లి ప్రయత్నాల్లో విజయం!
కియారా అద్వానీకి కలిసి రాని టాలీవుడ్..
కియారా అద్వానీకి కలిసి రాని టాలీవుడ్..
పొలం గట్లపై వింత ముద్రలు.. ఆ గ్రామంలో క్షణక్షణం భయం భయం!
పొలం గట్లపై వింత ముద్రలు.. ఆ గ్రామంలో క్షణక్షణం భయం భయం!
75 బంతుల్లో సెలెక్టర్లకు ఇచ్చిపడేసిన టీమిండియా బ్యాడ్ లక్కోడు..
75 బంతుల్లో సెలెక్టర్లకు ఇచ్చిపడేసిన టీమిండియా బ్యాడ్ లక్కోడు..
న్యూ ఇయర్ స్పెషల్ విషెస్ చెప్పాలా..? హెల్మెట్ బొకేలు ట్రై చేయండి
న్యూ ఇయర్ స్పెషల్ విషెస్ చెప్పాలా..? హెల్మెట్ బొకేలు ట్రై చేయండి
Late Night Sleep: రాత్రి నిద్ర ఆలస్యం చేస్తున్నారా? ఐతే డేంజర్‌
Late Night Sleep: రాత్రి నిద్ర ఆలస్యం చేస్తున్నారా? ఐతే డేంజర్‌
స్మార్ట్ టీవీ హ్యాక్ అయ్యే అవకాశం ఉందా? ఈ 5 ప్రమాదకరమైన సంకేతాలు
స్మార్ట్ టీవీ హ్యాక్ అయ్యే అవకాశం ఉందా? ఈ 5 ప్రమాదకరమైన సంకేతాలు
ఒరిస్సా తీసుకున్న నిర్ణయంతో భగ్గుమంటున్న కొటియా గ్రామాల ప్రజలు
ఒరిస్సా తీసుకున్న నిర్ణయంతో భగ్గుమంటున్న కొటియా గ్రామాల ప్రజలు
Video: క్రికెట్‌ హిస్టరీలో కొత్త షాట్.. ఏకంగా స్టాండ్ మార్చుకుని
Video: క్రికెట్‌ హిస్టరీలో కొత్త షాట్.. ఏకంగా స్టాండ్ మార్చుకుని