Andhra: జస్ట్ 10 వేలకే రూ.50 లక్షల బంగారం.. చిలకలపూడికి క్యూ కడుతున్న మహిళలు.. అసలు మ్యాటర్ ఏంటంటే..
పసిడి ధరలు రోజురోజుకు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడడంతో బంగారం కొనే ఆలోచనలో ఉన్న మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం గ్రాము 24 క్యారెట్ బంగారం ధర 1.30 లక్షలు దాటిపోయింది. బంగారం ధరలు ఇంకొంచెం ఎగబాకే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు.

పసిడి ధరలు రోజురోజుకు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడడంతో బంగారం కొనే ఆలోచనలో ఉన్న మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం గ్రాము 24 క్యారెట్ బంగారం ధర 1.30 లక్షలు దాటిపోయింది. బంగారం ధరలు ఇంకొంచెం ఎగబాకే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు బంగారం కొనడం కష్టమైపోవడంతో.. చాలామంది ప్రజలు ఇమిటేషన్ గోల్డ్ వైపు మొగ్గు చూపుతున్నారు..
మచిలీపట్నంలోని చిలకలపూడి ఇమిటేషన్ ఆభరణాల తయారీలో పేరు తెచ్చుకున్న ప్రాంతం.. బంగారం ధరల పెరుగుదలతో ఈ ప్రాంతం మళ్ళీ దేశవ్యాప్తంగా దృష్టి ఆకర్షిస్తుంది.. ఇక్కడ తయారయ్యే రోల్డ్ గోల్డ్, గోల్డ్ ప్లేటెడ్ హారాలు, గాజులు, వంకీలు, ఉంగరాలు, బ్రెడల్ సెట్ ఏమి చూసినా అసలు బంగారమే.. అనేంతగా.. అంత క్వాలిటీతోపాటు.. నైపుణ్యంతో తయారవుతాయి. తక్కువ బరువు ఆకట్టుకునే డిజైన్లు చవక ధరలు ఇవన్నీ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి..
రెండు తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, తమిళనాడు, లాంటి పురుగు రాష్ట్రాలే కాదు సౌదీ అరేబియా, శ్రీలంక, చైనా ధాయిలాండ్ నుంచి కూడా వ్యాపారులు ఇక్కడ ఉత్పత్తులు లను భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. 100 రూపాయలు నుంచి 10,000 వరకు లభించే ఈ ఆభరణాలు సాధారణ కుటుంబాలకు నిజమైన వరంలా మారాయి..
ఒక్కో ఆభరణం వెనుక అనేకమంది కళాకారుల శ్రమ దాగి ఉంటుంది. ఓకే బ్రైడల్ సెట్ తయారీకి 20 నుంచి 25 మంది కలిసి పని చేయాల్సి వస్తుంది. చివర్లో వేసే బంగారు పూత ప్రత్యేక పాలిష్ ఇవి ఆభరణానికి సంవత్సరాల పాటు మెరుపును నిలబెడతాయి.. 1990లో చిన్న స్థాయిలో మొదలైన ఈ వ్యాపారం ఇప్పుడు పెద్ద ఎంఎస్ఎంఈ రంగంగా వికసించి వేల కుటుంబాలకు ఆధారంగా నిలిచింది. 250 కు పైగా తయారీ యూనిట్లు.. దాదాపు 20060 రిటైల్ షాపులతో చిలకలపూడి మచిలీపట్నం మార్కెట్ ఇప్పుడు రద్దీగా ఉంటుంది..
ఇక్కడ కొనుగోలు చేసే విక్రయదారులు పలువురు మాట్లాడుతూ.. తమ కుటుంబంలో మచిలీపట్నం ఆభరణాలు కొనడం ఒక సాంప్రదాయమని చెప్తున్నారు.. నాణ్యత మెరుపు ఆకర్షణ ఇలా.. ఏ విషయంలోనూ అసలు బంగారంతో పోల్చినట్లు ఉంటుందని తెలియజేశారు. మరోవైపు హైదరాబాదుకు చెందిన మరో మహిళ తాను కొన్న బ్రెడల్ చెట్టుకు కేవలం 10,000 మాత్రమే ఖర్చయిందని అదే అసలు బంగారంలో కొనుగోలు చేస్తే లక్షల్లో ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఇమిటేషన్ జ్యువెలరీని సాధారణ కుటుంబాలకు దేవుని కానుకగా అభివర్ణిస్తున్నారు..
బంగారం వెండి ధరల పెరుగుదలతో.. దేశం నలుమూలల నుంచి కస్టమర్లు చిలకలపూడికి వస్తున్నారని ఇమిటేషన్ జ్యువలరీ పార్క్ అసోసియేషన్ కార్యదర్శి జితేంద్రకుమార్ చెబుతున్నారు.. తక్కువ ధరలోనే బంగారంలా కనిపించడం ఈ పరిశ్రమ ప్రధాన బలంగా చెప్పుకొచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




