నిన్నటి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం మంగళవారం దక్షిణ మధ్య బంగాళాఖాతం, సగటు సముద్ర మట్టానికి 1.5 కిమీ ఎత్తులో విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..
ఇది చదవండి: పత్తి చేనులో కలుపు తీస్తుండగా.. బాబోయ్.! కనిపించింది చూసి గుండె గుభేల్
ఉత్తర కోస్తాంధ్ర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో మంగళ, బుధువారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రాబోయే రెండు రోజులులో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉంది.
ఇది చదవండి: పోలీసుల తనిఖీల్లో తేడాగా కనిపించిన యువకుడు.. బ్యాగ్ చెక్ చేయగా.. వామ్మో
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
నవంబర్ 05, మంగళవారం :
•శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
~ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) November 4, 2024
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..