AP Rains: ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.. అక్కడ మోస్తరు వర్షాలు

ఏపీకి మరో వర్ష గండం ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ. మరి ఇంతకీ వచ్చే 3 రోజులు రాష్ట్రంలో వాతావరణ సూచనలు ఇలా..

AP Rains: ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.. అక్కడ మోస్తరు వర్షాలు
Ap Rains
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 06, 2024 | 5:25 PM

భూమధ్య రేఖ ప్రాంత హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయం బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దాని ప్రభావంతో సుమారు డిసెంబర్ 7వ తేది నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి నైరుతి బంగాళాఖాతం మీదుగా డిసెంబర్ 12 నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాల వద్దకు చేరుతుంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య/తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. దీంతో రాగల మూడు రోజుల్లో ఏపీలో వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం:- —————————————-

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- ——————————

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ:- —————–

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.