AP Rains: ఏపీకి వాన గండం ఇంకా వీడలేదా.? ఇదిగో తాజా వెదర్ రిపోర్ట్
పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరంగా పయనించే క్రమంలో ఒడిశా, బెంగాల్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ కేంద్రం చెప్పింది.
పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరంగా పయనించే క్రమంలో ఒడిశా, బెంగాల్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ కేంద్రం చెప్పింది. వచ్చే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు పడనున్నాయి. కోస్తాంధ్రలో భారీ వర్షాలు, రాయలసీమలో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో తీరం వెంబడి గంటకు 55 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలు, వరదల తీవ్రత దృష్ట్యా శుక్రవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు ఆ జిల్లా కలెక్టర్. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజలకు అవసరమైన ఆహారం, నీరు పంపిణీ చేస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుసే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. శుక్రవారం గద్వాల్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాలకు వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అటు హైదరాబాద్‌లో మోస్తరు వర్షం కురుస్తుందని పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. పలు జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అలాగే, ఈ నెల 9 వరకు పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది.
HEAVY RAIN ALERT – SEP 4-9 2024 ⚠️
Due to fresh LPA again POWERFUL RAINS expected in PINK matked areas. Big trouble is that this is the same area which got devastated by massive floods, again one more heavy rainfall event is ready to strike (slightly less than previous one, but… pic.twitter.com/kqzZH8unET
— Telangana Weatherman (@balaji25_t) September 4, 2024