Chandrababu: సీఎం చంద్రబాబు అన్ స్టాపబుల్.. ఏడు పదుల వయస్సులోనూ ఏమాత్రం తగ్గట్లేదు..!
ఏడు పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గట్లేదు ఏపీ సీఎం చంద్రబాబు. బెజవాడలో వరద బాధితులను పరామర్శించడమే కాదు...సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పదండి ముందుకు అంటూ అధికార గణాన్ని ముందుకు నడిపిస్తున్నారు.
ఏడు పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గట్లేదు ఏపీ సీఎం చంద్రబాబు. బెజవాడలో వరద బాధితులను పరామర్శించడమే కాదు…సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పదండి ముందుకు అంటూ అధికార గణాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఉక్కు సంకల్పం ఉంటే… వరద బురద అడ్డం కాదు అంటూ నిరూపిస్తున్నారు. డే 1 నుంచి డే 5 దాకా ఓ యజ్ఞంలా సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ అన్ స్టాపబుల్‌గా సాగిపోతున్నారు.
ఉక్కు సంకల్పం ఉండాలే కానీ….వరద బురద అడ్డం రావు. వయసు గియసు ఏం చేయలేవు. ఇదే విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి నిరూపించారు. బుడమేరు ధాటికి కుంగిపోయిన బెజవాడకు సాంత్వన చేకూరుస్తున్నారు. లక్షలమంది వరద బాధితులకు నేనున్నా అంటూ భరోసా ఇస్తున్నారు. రేయింబవళ్లు విజయవాడలో పర్యటించడమే కాకుండా, సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కలెక్టరేట్ లోనే బస చేసి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు…సహాయక చర్యలను వేగవంతం చేయిస్తున్నారు.
బెజవాడపై బుడమేరు విరుచుకుపడ్డ మొదటి రోజు నుంచి ఇవాల్టి దాకా, ఐదు రోజులుగా అదే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు చంద్రబాబు. ఐదో రోజు కూడా ఫుల్ బిజీగా సీఎం చంద్రబాబు గడిపారు. వరద తగ్గేవరకూ ఉంటా… సాయం అందించే వెళ్తా అంటున్నారు చంద్రబాబు. పారిశుద్ధ్య పనులపై అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ క్లీనింగ్ షురూ చేసి…విజయవాడను మళ్లీ అతి త్వరలోనే పట్టాలెక్కించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఇక కలెక్టరేట్‌లో దాతల నుంచి విరాళాలు స్వీకరించడం…ఇలా ఒక్కటేంటి బిజీ షెడ్యూల్‌తో క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు బాబు.
అధికారులతో సమావేశాల అనంతరం బుడమేరు ముంపు ప్రాంతంలో పర్యటించారు చంద్రబాబు. పంటు సాయంతో బుడమేరు ప్రాంతాన్ని పరిశీలించారు. గండ్లు పడిన ప్రాంతాల్లో మరమ్మతు పనులపై ఆరా తీశారు. పలువురు స్థానికులతోనూ మాట్లాడి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మధురానగర్ వెళ్లారు చంద్రబాబు. మధురానగర్ బ్రిడ్జి దగ్గర ముంపు ప్రాంతాలను స్వయంగా చూశారు. అక్కడి స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తీవ్రంగా కృషి చేస్తున్నామని… వీలైనంత త్వరగా విజయవాడను యథాస్థితికి తీసుకొస్తామని వారిలో భరోసా నింపారు.
చంద్రబాబు మధురానగర్‌లోని ముంపు ప్రాంతాల్ని పరిశీలిస్తుండగా…అక్కడ కాసేపు ఊపిరి బిగబట్టే సీన్ చోటుచేసుకుంది. చంద్రబాబు బ్రిడ్జ్ మీద ఉండగానే… ట్రాక్‌పైకొచ్చింది ట్రైను. వెంటనే అప్రమత్తమైన అధికారులు… చంద్రబాబును అలర్ట్ చేశారు. దీంతో ట్రాక్‌పై ఉన్న ఫుట్‌పాత్‌పై.. ట్రైన్ వెళ్లే వరకు ఇరుక్కుని నిల్చున్నారు చంద్రబాబు. అయితే… ఎవరికి ఎలాంటి ప్రమాదం లేకపోయినప్పటికీ… ట్రైన్ ఒక్కసారిగా రావడంతో కొన్ని క్షణాలపాటు అందరిలో టెన్షన్ నెలకొంది.
ఏడు పదుల వయస్సులోనూ ఏమాత్రం తగ్గట్లేదు సీఎం చంద్రబాబు. కారు, కాన్వాయ్ లేకుండానే వరద ప్రాంతాల్లో ఓ సామన్యుడిలా పర్యటిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం… అండగా ఉంటాం అంటూ ముందుకెళ్తున్నారు. డైలీ బ్రేక్ ఫాస్ట్ అవ్వడంతోనే ఫుల్ బిజీ అయిపోతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..