Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బొప్పాయి పండులో కనిపించిన దృశ్యం చూసి షాక్.. భక్తి పారవశ్యంతో పొంగిపోయిన మహిళలు

బొప్పాయి పండులో వినాయకుడి రూపం దర్శనమివ్వడంతో ఆ చుట్టు పక్కల ప్రజల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. తండోప తండలుగా తరలి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు.

బొప్పాయి పండులో కనిపించిన దృశ్యం చూసి షాక్.. భక్తి పారవశ్యంతో పొంగిపోయిన మహిళలు
Ganesh In Papaya
Follow us
Pvv Satyanarayana

| Edited By: Balaraju Goud

Updated on: Sep 12, 2024 | 4:01 PM

కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో వింత చోటు చేసుకుంది. బొప్పాయి పండులో కనిపించిన దృశ్యం చూసి షాక్ అయ్యారు. వింత వినాయకుడు అందర్నీ అలరిస్తున్నాడు. బొప్పాయి పండులో వినాయకుడి రూపం దర్శనమివ్వడంతో ఆ చుట్టు పక్కల ప్రజల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. తండోప తండలుగా తరలి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు.

ఈ వినాయకుడి ప్రత్యేకత ఏంటంటే.. బొప్పాయి పండులో తొండం రూపంలో వినాయకుడు వెలిశాడు అంటున్నారు. అందుకే పూజలు చేస్తున్నారు భక్తులు. తాజాగా కాకినాడ జిల్లాలో ఓ వింత వినాయకుడు దర్శన మిచ్చాడు. దీంతో ఆ చుట్టుపక్కల ప్రజలు వినాయకుడిని చూసేందుకు తండోపతండాలుగా వస్తున్నారు.

బొప్పాయి పండులో గణేశుని రూపం స్పష్టంగా కనిపించడంతో ఆ గ్రామం భక్తుల ఆనందం రెట్టింపు అవుతోంది. దీంతో బొప్పాయి పండులోని గణపతికి పూజలను చేస్తూ, గ్రామంలోని వినాయకుని మండపంలో ఉంచారు. ఈ ఘటన కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రి పేట గ్రామంలో చోటు చేసుకుంది. బొప్పాయి పండులో అరుదైన వింత ఆకారం కనిపించింది. అదే గ్రామానికి చెందిన నక్క పెంటమ్మ తన ఇంటిలో బొప్పాయి చెట్టుకు కాసిన మొదటి బొప్పాయి కాయను గణపతి నవరాత్రులు సందర్భంగా గ్రామంలోని సగరపేటలో నిలిపిన గణపతి మండపానికి తీసుకెళ్లి స్వామివారికి నైవేద్యంగా సమర్పించింది. నైవేద్యం పెట్టిన అనంతరం ఇంటికి తీసుకెళ్లి తిందామని బొప్పాయి కాయను కోయగా అందులో బుల్లి ఆకృతిలో బొజ్జగణపయ్య తొండంతో ప్రత్యక్షం అయ్యారు.

నక్క పెంటమ్మ బోప్పాయి పండులోని గణపతిని చూసి అవాకై దైవంగా కొలిచి దండం పెట్టింది. సాక్షాత్తు వినాయకుడే ఈ రూపంలో ప్రత్యక్షమై ఊరికి వచ్చాడని భావించి మండపంలో పెట్టి పూజలు చేయటం ప్రారంభించింది పెంటమ్మ. ఈవార్త ఆనోటా ఈ నోటా పాకడంతో.. బొప్పాయిలో బొజ్జ గణపయ్యను చూసెందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆ గణనాథుడు ఈవిధంగా ప్రత్యక్షమవ్వటం చాలా ఆనందంగా ఉందని పెంటమ్మ చెబుతున్నారు. చుట్టు పక్కల వారంతా కూడా గణపయ్య ఆకారాన్ని చూసి మురిసిపోతున్నారు.

విఘ్నేశ్వరుడిని పూజించడం వల్ల అడ్డంకులన్నీ తొలగుతాయని, అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. వినాయక చవితి మొదలుపెట్టి.. ప్రతీ పూజలోనూ మొదట వినాయకుడిని పూజించి ఆరాధిస్తుంటారు. రకరకాల ఆకారాలలో వినాయకుడిని తయారు చేసి, పూజా గదిలో ప్రతిష్టించి ఆయనకు ప్రత్యేక పూజలు కూడా చేస్తాం. వినాయక చవితి రోజున వాడవాడలా మండపాలలో రకరకాల అవతారాలలో వినాయకుడిని ప్రతిష్టించి పూజలు చేస్తుంటాం. ఇప్పుడు నేరుగా తమ ఊరికి వినాయకుడు బొప్పాయి పండు రూపంలో రావడంతో ఆ భక్తురాలు ఆనందం రెట్టింపు అవుతోంది. వినాయకుడి కనికరంతో గ్రామంలోకి వచ్చాడ‌ని భావించి బొప్పాయి పండుకు పూజలు చేస్తున్నారు స్థానికులు. వినాయకుడు ఇలా దర్శనమివ్వడం శుభసూచకమని, ఇక తమకు అంతా మంచే జరుగుతుందని గ్రామస్తులు నమ్ముతున్నారు.

వీడియో చూడండి… 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..